రాజమహేంద్రవరం :
ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి చూసి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చలించారు. స్థానిక 3వ డివిజన్ రాజేంద్రనగర్కు చెందిన బి యశ్వంత్ అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ పొరపాటున వేడి నీలల్లో పడ్డారు. దీంతో అతడి శరీరం బొబ్బలెక్కి తీవ్రంగా గాయపడింది. దీంతో అతడి తల్లిదండ్రులు వైద్యం దానవాయిపేటలోని శ్రీ హాస్పటల్కు తీసుకువెళ్లగా సదరు విషయాన్ని ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ బాబును పరామర్శించి అతడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. బాలుడి పరిస్థితి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారిని చూసి చల్లించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అలాగే ఆ బాలుడి వైద్యం కోసం అయ్యే ఖర్చంతా తామే తమ భవానీ చారిటబుల్ ట్రస్టు తరపున భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆ బాలుడికి వైద్యం కోసం అయిన రూ.30,000 వైద్య ఖర్చును ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు తరపున తిలక్ రోడ్డులోని నగర టీడీపీ కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము ఇచ్చిన హామీ మేరకు బాలుడికి ఆర్థిక సహాకారం అందించడం జరిగిందన్నారు. తమ భవానీ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఇప్పటికే వేలాది మంది పేద విద్యార్థులకు ఫీజులు చెల్లించడం, పేదలకు వైద్య ఖర్చుల కోసం ఆర్ధిక సహకారం అందించడం జరిగిందన్నారు. తమ ట్రస్టు తరపున భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను ఇలానే కొనసాగిస్తామన్నారు.
Also read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





