మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నారో.. లేక మాకు తిరుగు లేదు అనుకున్నారేమో కానీ స్టేషన్‌నే పేకాట క్లబ్‌గా మార్చేశారు ఆ ఎక్సైజ్ పోలీసులు. అక్రమ మద్యపానంపై ఉక్కు పాదం మోపాల్సింది పోయి, మూడు పెగ్గులు.. ఆరు ముక్కలు.. అన్నట్టుగా పేకాటలో మునిగిపోయారు. సకుటుంబ సమేతంగా అన్నట్టుగా ఆఫీస్ స్టాప్ అంతా కలిసి దర్జాగా ఎక్సైజ్ కార్యాలయంలోనే పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అనుకున్నారో.. లేక మాకు తిరుగు లేదు అనుకున్నారేమో కానీ స్టేషన్‌నే పేకాట క్లబ్‌గా మార్చేశారు ఆ ఎక్సైజ్ పోలీసులు. అక్రమ మద్యపానంపై ఉక్కు పాదం మోపాల్సింది పోయి, మూడు పెగ్గులు.. ఆరు ముక్కలు.. అన్నట్టుగా పేకాటలో మునిగిపోయారు. సకుటుంబ సమేతంగా అన్నట్టుగా ఆఫీస్ స్టాప్ అంతా కలిసి దర్జాగా ఎక్సైజ్ కార్యాలయంలోనే పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కారు. ఈ భాగోతం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎక్సైజ్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
చెన్నూర్ ఎక్సైజ్ స్టేషన్ లో ఓ హెడ్ కానిస్టేబుల్ తో సహా మరో ఐదుగురు కానిస్టేబుళ్లు కలిసి పేకాట ఆడుతూ కెమెరాకు చిక్కారు. ఈ వీడియో , పేకాట ఆడుతున్న సిబ్బంది పోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసాంఘీక కార్యకలాపాలను నిర్మూలించే బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న వారే ఇలా పేకాట ఆడటం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ఎక్సైజ్ స్టేషన్ లో ఈ వ్యవహారం సాగుతుందని ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసినా చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఎక్సైజ్ కార్యాలయాన్ని పేకాట క్లబ్ గా మార్చిన సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





