అనంతపురం పట్టణం కొవ్వూరు నగర్లో ఈ ఘటన జరిగింది. ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి.. మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కుని వెళ్లారు. 5 తులాల బంగారు గొలుసును బలంగా లాగడంతో బాధితురాలు మాధవీలత కింద పడిపోయారు. భర్త బైక్ తాళాలు కనిపించకపోవడంతో గుడికి నడుచుకుంటూ వెళదామని బయల్దేరారు..
కార్తీక పౌర్ణమి.. దీంతో ఆ మహిళ తెల్లవారుజామున పుణ్య స్నానం ఆచరించి పూజలు చేసేందుకు ఆలయానికి బయలు దేరింది.. ఇంతలోనే.. ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి బైక్ పై అటుగా వచ్చారు.. ముసుగులు వేసుకున్నారు.. ఆమె వారిని గమనించకుండా.. గుడికి వెళ్తూ ఉంది.. ఇంతలోనే.. వారు రాగానే మెడలోని బంగారు గొలుసు గుంజుకుని పారిపోయారు.. చైన్ స్నాచింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో కలకలం రేపింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వెళుతున్న మహిళ మెడలోని గోల్డ్ చైన్ ను ఇద్దరు దుండగులు లాక్కొని పారిపోయారు. కొవ్వూరు నగర్‌లో మాధవీలత అనే మహిళ తెల్లవారుజామున నడుచుకుంటూ గుడికి వెళుతుండగా.. బైక్ పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు.. ఆమె మెడలోని ఐదు తులాల బంగారు గొలుసును లాక్కెళ్ళారు.
గొలుసును లాక్కుని వెళుతుండగా.. బాధితురాలు మాధవీలత కిందపడింది.. భర్త బైక్ తాళాలు కనిపించకపోవడంతో మాధవీలత గుడికి నడుచుకుంటూ వెళ్లింది. ఈ సమయంలోనే.. మాధవిలత మెడలోని చైన్ ను దుండగులు లాక్కెళ్ళారు.. ఈ ఘటనపై మాధవీలత పోలీసులకు ఫిర్యాదు చేశారు..
చైన్ స్నాచింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నట్లు ఫోర్త్ టౌన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- నవ జనార్ధనల క్షేత్రాల గురించి తెలుసా? ఒక్కసారి దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు దూరం!
- నేటి జాతకములు..23 నవంబర్, 2025
- భగవద్గీత పుట్టిన పవిత్ర మాసం- దేవతల వరప్రసాదాల కేంద్రం- ‘మార్గశిర’ ప్రత్యేకత ఇదే!
- 2026లో లక్ష్మీ దేవి అనుగ్రహం వీరిపైనే.. కట్టలు కట్టలుగా డబ్బు సంపాదించడం ఖాయం!
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు




