ప్రస్తుతం కార్తీక మాసం. అందరికీ తెలిసిందే. ప్రతిరోజు తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో శివాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించే వారితో కిటకిటలాడుతుంటాయి. ఆ దీపాలు వెలిగించేటప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా జరగరాని నష్టం జరుగుతుంది. అలాంటిదే కర్నూలు జిల్లాలో జరిగింది. ఆ వివరాలు ఇలా..
వెల్దుర్తికి చెందిన గొల్ల సుబ్బన్న, సులోచన దంపతులకు రేవతి కుమార్తె. వయసు 8 సంవత్సరాలు. మూడో తరగతి చదువుతోంది. స్థానిక శివాలయంలో కార్తీకదీపం వెలిగించేందుకు రేవతితో కలిసి సులోచన వెళ్ళింది. దీపం వెలిగించిన తర్వాత.. దీపం వెలుగు రేవతి డ్రెస్‌కి అంటుకుంది. మంటలు చెలరేగి ఒంటి నిండా వ్యాపించాయి. మొత్తం శరీరం అంతా కాలింది. తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక నిన్న మృతి చెందింది.
బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల దుఃఖం అంతా కాదు. అయ్యో.! ఎంత ఘోరం జరిగింది అంటూ రోధించారు. బ్రతికి ఉండగానే ఆసుపత్రిలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత మృతి చెందిన సంఘటన తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే కూడా కలత చెందారు. చూశారుగా.! ఈ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణం కూడా పోయే పరిస్థితిలు ఉన్నాయి. సో.! బీ కేర్‌ఫుల్
Also Read
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?
- Telangana: కనిపెంచిన కొడుకును కడతేర్చిన తండ్రి.. కారణం తెలిస్తే షాకే
- Andhra: అమ్మతో కలిసి కార్తీకదీపం వెలిగించాలనుకుంది.. తీరా చూస్తే కాసేపటికే..





