SGSTV NEWS online
CrimeTelangana

ఇంకా వీడని నిజామాబాద్ మహిళ మర్డర్ మిస్టరీ.. తల, చేతి వేళ్లు మాయం!




తల నరికి.. చేతుల వేళ్లు తొలగించి.. నగ్నంగా రోడ్డుపై పడేసిన మహిళా మర్డర్ మిస్టరీ పోలీసులకు సవాల్‌గా మారింది. తల భాగం దొరక్కపోవడంతో మహిళ ఎవరు అనేది గుర్తించలేక పోతున్న పోలీసులు. ఈ హత్య చేసిన దుండగులు ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్తపడ్డారు. కనీసం సీసీ కెమెరాలకు సైతం ఆచూకీ చిక్కలేదు. హత్యాచారం చేసి హత్య చేశారా, ఎక్కడో హత్యచేసి..

నిజామాబాద్, నవంబర్ 3: నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో మహిళా దారుణ హత్యకు గురైంది. మొండెంతో నగ్నంగా మహిళా మృతదేహం లభ్యమైంది. తల నరికి.. చేతుల వేళ్లు తొలగించి.. నగ్నంగా రోడ్డుపై పడేసిన మహిళా మర్డర్ మిస్టరీ పోలీసులకు సవాల్‌గా మారింది. తల భాగం దొరక్కపోవడంతో మహిళ ఎవరు అనేది గుర్తించలేక పోతున్న పోలీసులు. ఈ హత్య చేసిన దుండగులు ఎలాంటి క్లూస్ లేకుండా జాగ్రత్తపడ్డారు. కనీసం సీసీ కెమెరాలకు సైతం ఆచూకీ చిక్కలేదు. హత్యాచారం చేసి హత్య చేశారా, ఎక్కడో హత్యచేసి మిట్టాపూర్ లో డెడ్ బాడీ పడేసారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం మిట్టాపూర్‌ శివారులో ఓ గుర్తుతెలియని మహిళను కిరాతకంగా హత్య చేసి, తల భాగం నరికి.. మొండెం రోడ్డుపై పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహానికి తల లేదు. కుడి చేతిమణికట్టు వరకు, ఎడమ చేతి వేళ్లను సగం వరకు నరికి వేశారు. మిట్టాపూర్‌కు చెందిన రైతు సతీష్‌ శనివారం ఉదయం పొలం పనులకు వెళ్తుండగా.. పొలం సమీపంలో శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేని మహిళ మృతదేహం చూపి భయభ్రాంతులకు గురయ్యాడు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం నిజామాబాద్‌ సీపీ సాయిచైతన్య, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతి చెందిన మహిళకు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.

అత్యాచారం అనంతరం హత్య చేసి శుక్రవారం అర్ధరాత్రి వాహనంలో ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నరికిన అవయవాల జాడ కోసం పోలీసులు డ్రోన్‌ కెమెరాతో డెడ్‌ బాడీ దొరికిన ప్రదేశంలో గాలిస్తున్నారు. పోలీసులు పది బృందాలుగా ఈ కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. మృతురాలి ఆచూకీ తెలియకుండా ఆమె చేతి వేళ్లు నరికేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే నిందితుల బండారం బయటపడుతుందని ముందే ఆమె చేతి వేళ్లు తొలగించి ఉంటారని భావిస్తున్నారు

Also Read

Related posts