సెల్‌ఫోన్‌లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
వెళ్లిపోవాలని.. లేనిపక్షంలో నరికేస్తానని హెచ్చరిక
అన్నట్లుగానే కొద్దిసేపటికి వచ్చి దాడి
కాకినాడ జిల్లా యర్రంపాలెంలో దారుణం
మద్యం మత్తు.. బంధాలు చిత్తు
గండేపల్లి: పూటుగా తాగిన మద్యం మత్తు తలకెక్కి, విచక్షణ కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఓ కిరాతకుడు బాలుడిని కత్తితో నరికి చంపేశాడు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామంలో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. యర్రంపాలేనికి చెందిన బుంగా బాజ్జీ అలియాస్ బాబీ (17), అతడి స్నేహితుడు ఇజ్జిన చందు శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో కొమ్ము సత్తిబాబుకు చెందిన ఇంటి పునాదిపై కూర్చుని సెల్ఫోన్లో ఆడుతున్నారు.
దీనికి ఎదురుగా నివాసం ఉంటున్న కాకర చిన్ని (సుమారు 50 ఏళ్లు) వీళ్ల వద్దకు వచ్చాడు. అర్ధరాత్రి ఏం పని మీకు, వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పటికే అతడు పూటుగా తాగి ఉన్నాడు. ఈ క్రమంలో బాబీ, చిన్ని మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్ని.. అక్కడే ఉంటే నరికేస్తానంటూ బాబీని బెదిరించి ఇంటికి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే తిరిగి కత్తి పట్టుకుని వచ్చి, బాబీ మెడపై ఒక్కసారిగా నరికాడు. తీవ్రంగా గాయపడిన బాబీ అక్కడి నుంచి ఇంటికెళ్తూ రోడ్డుపై కుప్పకూలిపోయాడు.
స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. చిన్నిని బంధువులు శనివారం పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ‘రాత్రి అన్నం తిని అందరం పడుకున్నాం. ఎప్పుడు బయటకెళ్లాడో తెలీదు. నా కొడుకుని తీసుకురండి’ అంటూ హతుడు బాబీ తల్లి విజయకుమారి బోరున విలపిస్తోంది. ఘటన స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఇన్చార్జి సీఐ బి. సూర్య అప్పారావు, గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు, సిబ్బంది పరిశీలించారు.
Also read
- గదిలోకి మాస్క్ లేకుండా రావొద్దు.. హీలియం గ్యాస్ పీల్చుకుని చార్టర్డ్ అకౌంటెంట్ సూసైడ్..
- అందగా ఉంటుందని.. అమాయకరాలు అనుకునేరు..! విశాఖ రాథోడ్ మామూల్ది కాదు..
- ప్రేమ పేరుతో దారుణం.. బస్సులో నుంచి దింపి పొలాల్లోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యం..!
- Hyderabad: గది తలుపు తెరిచేసరికి షాకింగ్ సీన్..! యువ ఆర్కిటెక్ట్ మృతిపై ఎన్నో అనుమానాలు..!
- Hyderabad: హలో.. నేను అనన్య కులకర్ణి.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు సాఫ్ట్‌గా లైన్ కలిపింది.. కట్ చేస్తే..





