ఆదివారం తెల్లవారు జామున వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను దారుణంగా నరికి చంపింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. యాదయ్య అనే వ్యక్తి భార్య, వదిన, కొడుకును కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు..
వికారాబాద్, నవంబర్ 2: వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ సభ్యులను దారుణంగా నరికి చంపింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఈ దారుణ హత్యలు చోటు చేసుకున్నాయి. యాదయ్య అనే వ్యక్తి భార్య, వదిన, కొడుకును కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు. వరుస హత్యల అనంతరం నిందితుడు యాదయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురిని చంపే ప్రయత్నం చేయగా.. తృటిలో ఆమె తప్పించుకుంది. ఈ ఘటనలో మొత్తం 4 మంది మృతి చెందారు. ఈ హత్యలు, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో కాపురం ఉంటున్న యూదయ్య అనే వ్యక్తి భార్య అలవేలు, వదిన హన్మమ్మ, కూతురు శ్రావణిలను కొడవలితో హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతుల మరో కూతురు అపర్ణను కూడా యాదయ్య చంపేందుకు యత్నించాడు. అయితే ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ దారుణ ఘటన ఆదివారం (నవంబర్ 2) తెల్లవారుజామున చోటు చేసుకుంది. రోజువారీ కూళీగా పనిచేసే యాదయ్య భార్య అలవేలు పై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ నిందితుడు యాదయ్య గొడవ పడేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెల్లవారు జామున మరోమారు గొడవ పడగా ఇద్దరిని రాజీ చేసేందుకు వచ్చిన వదిన హన్మమ్మతో సహా భార్య, పిల్లలపై యాదయ్య కొడవలితో దాడి చేశాడు. వీరు ముగ్గురు మృతి చెందగా.. మరో కూతురు అపర్ణ మాత్రం తప్పించుకుంది.
హత్యల అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకొని యాదయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యలకు, ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్న డీఎస్పీ వెల్లడించారు
Also read
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..
- సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
- Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
- చిన్నారిపై లైంగిక దాడికి యత్నం





