నర్సంపేట, : ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో ఎస్సై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డులో నివాసముంటున్న ఎండీ హఫీజుద్దీన్(59) ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో పోలీసాఖ స్పెషల్ బ్రాంచి ఎస్సైగా పని చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన ఇంట్లో పురుగుమందు తాగగా.. కుటుంబసభ్యులు వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. మృతుడికి భార్య నూర్జహాన్, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరగ్గా.. ఒక కుమార్తె, కుమారుడికి పెళ్లిళ్లు చేయాల్సి ఉంది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. హఫీజజుద్దీన్ మరో నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు.
Also read
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..
- సెల్ఫోన్లో గేమ్ ఆడుతున్నాడని బాలుని హత్య
- Andhra Pradesh: అలిగిన భార్య కోసం వెళ్లిన భర్త.. చుట్టుముట్టిన బంధువులు.. అయ్యో చివరకు..
- చిన్నారిపై లైంగిక దాడికి యత్నం





