వనపర్తి : వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి ఓ భార్య కడతేర్చిన సంఘటన వనపర్తిలో చోటుచేసుకుంది.
పట్టణంలోని గణేశ నగర్లో నివాసముంటున్న కురుమూర్తి ఒక మాల్లో వాచ్‌మెన్‌గా పని చేసేవారు. అక్టోబరు 25 నుంచి కురుమూర్తి కనిపించడం లేదని ఆయన సోదరి చెన్నమ్మ 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వనపర్తి ఎస్సై శశిధర్ కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు… కురుమూర్తి భార్య నాగమణి మెట్‌పల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్ తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కుట్రపన్ని కురుమూర్తిని హత్య చేశారు. అనంతరం సెల్ఫ్ డ్రైవింగ్ పేరిట వనపర్తిలో కారును అద్దెకు తీసుకొని మృతదేహాన్ని తీసుకెళ్లి శ్రీశైలం డ్యాంలో పడేశారు.
చెన్నమ్మ అనుమానంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నాగమణి, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





