ఆదిలాబాద్ జిల్లాలో డబ్బుల కోసం దాష్టీకానికి పాల్పడి ఇందిరమ్మ లబ్దిదారుడిని చెట్టుకు కట్టేసిన నిందితుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలం కౌట (కె) గ్రామంలో మారుతి అనే ఇందిరమ్మ లబ్దిదారుని చెట్టుకు కట్టేసి దౌర్జన్యానికి పాల్పడ్డాడు కాంట్రాక్టర్, కాంగ్రెస్ పార్టీ నేత సత్యనారాయణ. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సత్యనారాయణ ను అదిపులోకి తీసుకోవాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు.
కాంట్రాక్టర్ సత్యనారాయణను ఇందిరమ్మ ఇళ్ల కాంట్రాక్టర్ నుండి తొలగించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా.. బ్లాక్ లిస్టులో పెట్టారు. కలెక్టర్ ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు సత్యనారాయణను అరెస్ట్ చేసి సొనాల పోలీస్ స్టేషను కు తరలించారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు సత్యనారాయణ అర్థరాత్రి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు.
అసలు విషయంలోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం కౌట (కె) గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న గుత్తేదారు సత్యనారాయణ లబ్దిదారుడు మారుతిని మూడు రోజుల క్రితం నడి రోడ్డుపై చేతులు కట్టేసి దాష్టీకానికి పాల్పడ్డాడు. బోథ్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసి కస్టడికి తరలించగా గురువారం (అక్టోబర్ 30) రాత్రి భోజనం చేశాక వాష్ రూమ్ కు వెళ్లి వస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ వెనుక నుండి పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు.
నిందితుడు మహారాష్ట్ర వైపు పారిపోయినట్టు తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పరారైన కాంట్రాక్టర్ గతంలో దళిత బస్తీ, దళిత బంధు పథకంలో దళారీ అవతారంలో లబ్దిదారుల నుండి లక్షల డబ్బులు వసూలు చేయడం బాధితులు ఫిర్యాదు చేయడం అప్పట్లో కలకలం రేపింది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని స్పష్టం చేయడం లేదు. పరారైన నిందితుడు కాంగ్రెస్ కార్యకర్త కావడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేశామని నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడె గజేందర్ తెలిపారు. సత్యనారాయణతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు.
Also read
- కార్తీక పౌర్ణమి రోజున ఈ ఒక్క పని చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే..
- కొమురవెల్లి మల్లన్న ఆలయం
- నేటి జాతకములు..4 నవంబర్, 2025
- విశ్వకర్మ బీమా అమలు చేయాలి
- Andhra: జాతకం చెప్పే వేలిముద్రలు.. రైల్వేస్టేషన్లో తెల్లవారుజామున 4గంటలకు ఒక్కసారిగా అలజడి..





