ఖమ్మంలో మందుబాబుల వీరంగం సృష్టించారు. కోరిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని వైన్‌షాప్ క్యాషియర్‌పై దాడికి దిగారు ఐదుగురు యువకులు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని తిరుమల వైన్‌షాప్‌లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు ..
మేము అడిగిన మద్యం బ్రాండ్ కావాల్సిందే అని పట్టు పట్టారు మందుబాబులు. ఆ బ్రాండ్ లేదని చెప్పడంతో మత్తులో రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. అడిగిన బ్రాండ్ లేదన్నందుకు వైన్ షాపు కౌంటర్ క్యాషియర్‌పై దాడికి దిగారు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో ఉన్న “తిరుమల వైన్ షాప్” లో పోలెపొంగు కృష్ణ అనే వ్యక్తి గత 6ఏళ్ల నుంచి క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల వైన్ షాప్ దగ్గరికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు మాకు రాయల్ స్ట్రాంగ్ మందు బాటిల్ కావాలని అడిగారు. ఆ బ్రాండ్ తమ వద్ద లేదని కృష్ణ చెప్పగా ఒక్కసారిగా వారు రెచ్చిపోయారు.. కౌంటర్లోకి చొరబడి కృష్ణపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఎంత వారించినా వినలేదు. ఈ దాడి ఘటన మొత్తం ఆ షాప్‌లో ఉన్న CC కెమెరాలో రికార్డు అయింది. వారి దాడిలో బాధితుడుకు గాయాలయ్యాయి.. కృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు
Also read
- నా కూతురి ఆచూకీ చెప్పండయ్యా.. పోలీస్ స్టేషన్లో తండ్రి ఏం చేశాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు!
- నిజ జీవితంలో ‘నాన్న పులి కథ’.. భర్త కళ్ల ముందే భార్య మృతి. సరిగా ఉరివేసుకో అనడంతో..
- తీవ్ర విషాదం.. భర్త మీద కోపంతో.. ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన మహిళ..!
- బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం
- ఉద్యోగం వస్తే ఇలా చేయాల్నా.. భర్తను కేసులతో హింసించిన భార్య.. పాపం చివరకు





