ఆంధ్రప్రదేశ్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మొంథా తుపాను వియజనగరం జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చింది. గుర్ల KGBVలో షార్ట్ సర్య్కూట్ కారణంగా 30 మంది విద్యార్థినులు విద్యుత్యాఘానికి గురయ్యారు. వారిలో ఐదుగురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు బాలికలను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభం కూలిపోయి హాస్టల్ బిల్డింగ్ గోడను తాకింది. అటువైపుగా వసతిగృహంలో గోడను ఆనుకొని ఉన్న 30 మంది విద్యార్థినులు కరెంట్ షాక్కు గురైయ్యారు. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రా జిల్లాలో భారీ నష్టం జరిగింది. అనేక చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వందలాది చెట్లు కూలీపోయాయి.
మొంథా తుఫాన్ కాకినాడ – మచిలీపట్నం మధ్య అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. అయితే ఈ తీవ్ర తుఫాన్ మరో 2 గంటల్లో తీరాన్ని దాటనున్నది. తీరం దాటే సమయంలో 110కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. తీరం దాటే ప్రక్రియ ప్రారంభం కావడంతో తీర ప్రాంత జిల్లాల్లో భారీ వేగంతో గాలులు వీస్తున్నాయి.
Also read
- భార్యాభర్తల సెల్ఫీ వీడియో – ఆపై సూసైడ్ – భార్యాభర్తలిద్దరూ మృతి… వీడియో
- కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!
- Jangaon District :విద్యర్థులందరు భోజనం చేశాక సాంబార్లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన
- సినిమా రేంజ్ ట్విస్ట్.. భార్యను ఇంటికి పంపించి.. గుట్టుగా ఆ పని చేశాడు.. కట్ చేస్తే సీన్ ఇది
- Telangana: అంత చిన్న విషయానికే.. ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?





