మనమందరం ఏదో ఒక సమయంలో రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసే ఉంటాము.. కొంతమంది దానిని అదృష్టంగా భావిస్తే, మరికొందరు దానిని దురదృష్టకరంగా భావించి వదిలేస్తారు. అయితే, రోడ్డుపై దొరికిన డబ్బును తీసుకోవడం మంచిదా చెడ్డదా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. నిజానికి, పండితులు, వాస్తు నిపుణులు దీని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అవేంటో వివరంగా తెలుసుకుందాం..
రోడ్డుపై వెళ్తున్నప్పుడు వీధిలో దొరికిన డబ్బును తీసుకోవడం దురదృష్టకరమని కొందరు నమ్ముతారు. ఎందుకంటే ఎవరో అజ్క్షాత వ్యక్తి ఆ డబ్బును పోగొట్టుకుని ఉండవచ్చు. లేదంటే అందులో ప్రతికూల శక్తి ఉండవచ్చు. అంటే ఆ డబ్బు తీసుకుంటే జీవితంలో సమస్యలను కలిగిస్తుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఉంటుంది. ఎక్కడైనా డబ్బు దొరికితే..దాని మూలం తెలియకుండా దాన్ని ఉపయోగించడం సరైనది కాదని చాలా మంది అంటారు.
కానీ మరోవైపు, కొంతమంది వాస్తు నిపుణులు, ఆధ్యాత్మిక పండితులు రోడ్డుమీద దొరికిన డబ్బును దేవుడి దీవెనగా భావించాలని చెబుతున్నారు.. వారి ప్రకారం, మీ పూర్వీకుల ఆశీర్వాదం వల్ల మాత్రమే మీకు డబ్బు వస్తుంది. ముఖ్యంగా నాణేలు దొరకడం అదృష్టానికి సంకేతమని వారు అంటున్నారు. అంటే, భవిష్యత్తులో మీకు ఆర్థికంగా మంచి రోజులు ఉండవచ్చనే సూచన ఇది.
అందుకే, మీరు రోడ్డు మీద డబ్బును చూసినప్పుడు, దానిని తీసుకునే ముందు స్వచ్ఛమైన హృదయంతో దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ఆ డబ్బును వెంటనే ఖర్చు చేయకూడదు లేదా ఎవరికీ దానం చేయకూడదు. బదులుగా, దానిని మీ పర్సులో లేదా ఇంట్లోని దేవుడి గదిలో విడిగా ఉంచమని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుందని, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని అంటున్నారు.
బంగారు వర్ణంలో మెరుస్తున్న నాగుపాము..! నాగుల పంచమినాటి అద్భుతం
కానీ నిపుణులు చెప్పేదేంటంటే, రోడ్డు మీద దొరికే డబ్బును తీసుకోకూడదనుకుంటే, దానిని ఆలయంలో ఉంచడం లేదా పేదలకు దానం చేయడం మంచిది. ఇది మీ కర్మను మెరుగుపరుస్తుంది. దేవుని దయ మీపై ఉంటుంది.
కాబట్టి, రోడ్డుపై దొరికిన డబ్బును అదృష్టం అని భావించి వెంటనే తీసుకోకండి. మొదట, దాని వెనుక ఉన్న శక్తి, విశ్వాసాన్ని అర్థం చేసుకోండి. మీరు దానిని దేవుని ఆశీర్వాదాలకు చిహ్నంగా గౌరవంగా ఉంచుకుంటే, అది శుభప్రదం. అయితే, మీరు దానిని నిర్లక్ష్యంగా లేదా స్వార్థపూరితంగా ఉపయోగిస్తే, అది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, అటువంటి పరిస్థితులలో ఆలోచించి వ్యవహరించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
Also read
- భార్యాభర్తల సెల్ఫీ వీడియో – ఆపై సూసైడ్ – భార్యాభర్తలిద్దరూ మృతి… వీడియో
- కురిక్యాల పాఠశాల ఘటనపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం!
- Jangaon District :విద్యర్థులందరు భోజనం చేశాక సాంబార్లో బల్లి ప్రత్యక్షం.. జనగామ జిల్లాలో ఘటన
- సినిమా రేంజ్ ట్విస్ట్.. భార్యను ఇంటికి పంపించి.. గుట్టుగా ఆ పని చేశాడు.. కట్ చేస్తే సీన్ ఇది
- Telangana: అంత చిన్న విషయానికే.. ఇంత దారుణమా.. అసలు ఏం జరిగిందంటే?





