ప్రపంచాన్ని వణికించిన కరోనాకు మందు కనిపెట్టాం. స్పేస్‌లో అద్భుతాలు చేస్తున్నాం. ఏఐ రంగంలో దూసుకుపోతున్నాం. అయినా సరే కొంతమంది మెదళ్ల నుంచి మూఢనమ్మకాలను మాత్రం దూరం చేయలేకపోతున్నాం. సమాజాన్ని ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. వివరాలు కథనం లోపల …
జంతు బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించే వ్యక్తులు సహజంగా కోళ్లు.. మేకలు బలిస్తుంటారు.. మరీ బరితెగించిన వారు మనుషులు బలిచ్చినట్లు అక్కడక్కడా వింటుంటాం… కానీ ఈ బ్యాచ్ అదో టైపు.. పందిని ( వరాహాన్ని) బలిచ్చి అంతా హడలెత్తి పోయేలాచేశారు.. గ్రామ శివారులో పందిని బలిచ్చి క్షుద్రపూజల నిర్వహించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో వెలుగుచూసింది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామశివారులో క్షుద్ర పూజలు నిర్వహించారు.. రోడ్డు పక్కనే పూజలు నిర్వహించి జనమంతా హడలెత్తి పోయేలా చేశారు.
ఐతే క్షుద్రపూజలు నిర్వహించిన ఆ దుండగులు వరహాన్నీ బలివ్వడం కలకలం రేపింది.. వరాహం తల భాగం నరికి ఆ రక్తంతో పూజలు నిర్వహించారు..ఆ మార్గంలో వెళ్తున్న గ్రామస్తులు ఈ క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి క్షుద్ర పూజలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





