కొండపి గ్రామీణం: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఎస్.ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన కసాయి తండ్రి మద్యం మత్తులో కొన్ని రోజుల క్రితం తన రెండో కుమార్తె (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు.
కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి..బాలికపై అఘాయిత్యం జరిగిందని నిర్ధరించారు. దీంతో కంగుతిన్న బాలిక తల్లి.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. గతంలో తన భర్త కూతురిపై చేతులు వేసి తడుముతున్నట్టు గుర్తించింది. అదే విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. బాలికను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. వెంటనే తల్లి కొండపి పోలీస్ స్టేషన్ కూ వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also read
- Telangana: హైదరాబాద్లో కాల్పుల కలకలం.. గన్తో ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు..
- Watch Video: సర్కార్ బడి టీచరమ్మ వేషాలు చూశారా? బాలికలతో కాళ్లు నొక్కించుకుంటూ ఫోన్లో బాతాఖానీ! వీడియో
- ప్రైవేటు స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగికదాడి!
- నేటి జాతకములు…5 నవంబర్, 2025
- అప్పు కోసం పిన్నింటికి వచ్చిన వ్యక్తి.. భార్యతో కలిసి ఏం చేసాడో తెలుసా..?





