తల్లి భారతి వయోభారం వలన అనారోగ్యంగా శుక్రవారం (అక్టోబర్ 24) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది. మృతదేహాన్ని నూజివీడులోని నివాసం ఉంటున్న అద్దె ఇంటికి తెచ్చేందుకు ప్రయత్నించగా, ఇంటి యజమాని అంగీకరించలేదు.
రాను రాను మనుషుల్లో మానవత్వం మరింత దిగజారుతోంది. బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. తాజాగా అందరూ ఉండి కూడా ఓ వృద్ధురాలు అనాథ మృతదేహంగా మిగిలిపోయింది. డబ్బుల కోసం కన్న తల్లి దహన సంస్కారాలు చేయడానికి ఓ కొడుకు ససేమిరా అన్నాడు. మరోవైపు వృద్ధురాలు వయోభారంతో, అనారోగ్యంతో చనిపోతే మృతదేహాన్ని తన ఇంటికి తీసుకుని రావద్దని అడ్డుకున్నాడు ఇంటి యజమాని. ఇంతటి దౌర్భాగ్యం పరిస్థితిని చూసి చలించి, తాము ఉన్నానని ముందుకు వచ్చారు స్మశానవాటిక నిర్వాహకులు. స్మశానవాటికలో రాత్రంతా మృతదేహాన్ని ఉంచి, తెల్లవారక అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
అభివృద్ధి చెందుతున్నామని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కనీస మానవత్వం కనిపించడం లేదు. పేగు పంచుకుని పుట్టి, ఆ కొన్ని తల్లి చనిపోతే డబ్బుకోసం దహన సంస్కారాలు కన్న కొడుకు అడ్డుకోవడం దారుణం. ఇటువంటి హీన పరిస్థితి ఒక కుటుంబంలో కనిపించింది. ఏలూరు జిల్లా నూజివీడు పట్టణ పరిధిలో ముసలి రామమందిరం సందులో మలిశెట్టి భారతి, రౌతు రాణి అనే తల్లి కుమార్తెలు ఓ ఇంటిలో అద్దె కుంటున్నారు. 70 ఏళ్ల వయసున్న వయోవృద్ధురాలు భారతికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె రాణి, మొదటి కుమారుడు మలిశెట్టి శివశంకర్, రెండవ కుమారుడు కృష్ణ. భారతి కుమార్తె రాణి ప్రైవేటు దుకాణంలో రోజువారి వేతనానికి పనిచేస్తుంది. కుమారులు ఇద్దరూ కూలి పనులు చేస్తూ జీవిస్తున్నారు.
తల్లి భారతి వయోభారం వలన అనారోగ్యంగా శుక్రవారం (అక్టోబర్ 24) ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భారతి మృతి చెందింది. మృతదేహాన్ని నూజివీడులోని నివాసం ఉంటున్న అద్దె ఇంటికి తెచ్చేందుకు ప్రయత్నించగా, ఇంటి యజమాని అంగీకరించలేదు. మృతదేహాన్ని తీసుకుని రావద్దని అడ్డుకున్నాడు. ఎలాంటి అవకాశం లేకపోవడంతో స్మశాన నిర్వాహకులను కోరగా వారు అవకాశం కల్పించారు. ఈ మేరకు వృద్ధురాలైన భారతీయ మృతదేహాన్ని స్మశాన వాటికలోనే రాత్రంతా ఉంచి, శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే భారతి ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు కృష్ణ డబ్బుల కోసం ఆశపడి దహన సంస్కారం చేసేందుకు నిరాకరించాడు. చేసేది లేక కుమార్తె రాణి, పెద్ద కుమారుడు అంతిమ సంస్కార కార్యక్రమం నిర్వహించారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరి దీన గాథ తెలుసుకుని స్థానికులు చలించిపోయారు. వృద్ధురాలి అంతి సంస్కారాలకు సహాయ సహకాలు అందించారు.
Also read
- Sabarimala Gold Case: శబరిమల గోల్డ్ కేసు దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. బళ్లారిలో పట్టుబడిన బంగారం..
- Telangana: ఇద్దరు బంగారు తల్లులతో నీ కడుపు పండితే.. ఎందుకమ్మా ఈ కఠిన నిర్ణయం
- Telangana: ఫోటో చూసి బుద్దిమంతుడు అనుకునేరు.. చేసేవి పోరంబోకు పనులు.. మ్యాటర్ తెలిస్తే
- Andhra: నాగులచవితి రోజున ఏపీలో అద్భుతం.. ఈ దృశ్యాలు చూస్తే పుణ్యం మీ సొంతం..
- Telangana: పగలు పద్దతిగా కస్టమర్ క్యారెక్టర్.. రాత్రి మంకీ క్యాప్ ధరించి.. అతడు ఏం చేశాడంటే.?





