SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: కడుపునొప్పితో మైనర్ బాలిక ఆస్పత్రికి.. ఆ కాసేపటికే..



ఒంటరిగా ఉన్న బాలికను లోబరుచుకున్నాడు సదరు వ్యక్తి. అదీనూ మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ సారి స్టోరీ చూసేయండి. లేట్ ఎందుకు మరి..


శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్కెట్ వీధికి చెందిన మైనర్ బాలికపై.. ఆమె పెద్దమ్మ కొడుకైన చిరంజీవి అనే వ్యక్తి లైంగిక దాడి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. సదరు బాలిక తల్లి పనికి వెళ్లిన సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు చిరంజీవి. దీంతో మైనర్ బాలిక గర్భవతి అయింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఆమెను.. తల్లి ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఆ కాసేపటికే మగబిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన వెంటనే ఆ శిశువు మరణించింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు పోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక నుంచి వాంగ్మూలం నమోదు చేసి.. నిందితుడిని చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Also read

Related posts