SGSTV NEWS
Spiritual

Karthika Masam: నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం.. ఈ నెలల్లో అన్నీ పండుగలే!





ఆశ్వీయుజ కృష్ణపక్ష అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. ఆ తరువాతి రోజు పాడ్యమి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. తదుపరి వచ్చే అమావాస్య వరకు ఉండే నెల రోజులను కార్తీక మాసం అని పిలుస్తారు. అంటే నేటినుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది.

అక్టోబర్ 21: ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో కార్తీక మాస వైశిష్ట్యం గురించి పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు’ అని అర్ధం. ఆశ్వీయుజ కృష్ణపక్ష అమావాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. ఆ తరువాతి రోజు పాడ్యమి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. తదుపరి వచ్చే అమావాస్య వరకు ఉండే నెల రోజులను కార్తీక మాసం అని పిలుస్తారు. అంటే నేటినుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది. శివకేశవులకు అత్యంత ప్రీతి పాత్రంగా ఈ మాసాన్ని చెబుతారు. ఎన్నో పండుగలకు నెలవైన ఈ మాస ప్రాశస్త్యాన్ని మరింత తెలుసుకుందాం

ఏడాదిలో తొమ్మిదో నెలలో వచ్చే కార్తీక మాసం(Karthika Masam) ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గం అని పండితులు చెబుతుంటారు. శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు.. కాబట్టి ఈ మాసానికి కార్తిక మాసమని పేరు వచ్చింది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో హరిహరులను ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసానికే దామోదర మాసం అని పేరు. ఈ మాసం అంతా ‘కార్తీక దామోదర’ అనే నామంతో స్మరణ చేస్తారు. కార్తీక మాసమంతా నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకుంటారు. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపాలు వెలిగిస్తారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఉసిరి దీపం, ఆవు నెయ్యితో దీపం పెడిస్తే శ్రేష్టం అని భావిస్తారు. అలాగే ఉసిరి చెట్టుకింద దీపాలు వెలిగిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మాసంలో కార్తీక వనభోజనాలు చేస్తారు. మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించారు.

అక్టోబర్ 22 తేదీన అన్న కూట్, గోవర్ధన్ పూజ, బలి ప్రతిపద పండుగ జరుపుకుంటారు. 23న భాయ్ దూజ్, యమ ద్వితీయ, చిత్రగుప్త పూజ.. 24న నాగుల చవితి.. 25న మాసిక వినాయక చతుర్థి వ్రతం.. 26న లాభ పంచమి 27న స్కంద షష్ఠి, ఛత్ పూజ.. 29న బుధ అష్టమి వ్రతం.. 30న గోపాష్టమి, మాసిక్ దుర్గా అష్టమి.. 31న అక్షయ నవమి, జగద్ధాత్రి పూజ.. నవంబర్ 1న ప్రబోధిని (దేవ్ ఉత్థాని) ఏకాదశి, కంస వధ, భీష్మ పంచకం.. 2న తులసీ వివాహం, వైష్ణవ దేవుత్థాన ఏకాదశి, యోగేశ్వర ద్వాదశి.. 3న విశ్వేశ్వర వ్రతం, సోమ ప్రదోష వ్రతం, వైకుంఠ చతుర్దశి.. 4న మణికర్ణిక స్నానం.. 5న దేవ్ దీపావళి, భీష్మ పంచకం ముగింపు, గురునానక్ జయంతి, పుష్కర స్నానం, కార్తీక పూర్ణిమ పండుగను నిర్వహించుకుంటారు

Also read

Related posts