హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మూసాపేట మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మెట్రో సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు బిహార్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతని దగ్గర బుల్లెట్ ఎందుకు ఉంది. అది అతని దగ్గరకు ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన యువకుడు కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని ప్రగతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే మహమ్మద్ శనివారం రాత్రి మూసాపేట మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌లోకి వెళ్లడానికి స్కానింగ్ మిషన్ గుండా వెళ్లాడు. ఇంతలో ఆ మెషిన్ నుంచి అలారం మోగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు.
తర్వాత అతని వద్ద ఉన్న బ్యాగ్‌తో పాటు అతన్ని దుస్తువులను కూడా చెక్ చేయగా అందులో వారికి ఒక బుల్లెట్ లభించింది. అది చూసిన భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన మెట్రో స్టేషన్‌కు చేరకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పీఎస్‌కు తరలించి తన దగ్గరకు బుల్లెట్ ఎలా వచ్చిందనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు
Also read
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
- విదేశీ అమ్మయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు