బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 గురించి తెలియని వారుండరు. అక్కినేని హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి అభిమానులు తక్కువేమీ కాదు. ఇక షోలోని కంటెస్టెంట్లు నామినేషన్స్, టాస్కులు, గోడలు ఇలా ప్రతీదాంట్లో రచ్చరంబోలా చేస్తుంటారు. అయితే ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ దేశంలో పలు..
బుల్లి తెరపై హై టీఆర్పీతో దూసుకుపోతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 గురించి తెలియని వారుండరు. అక్కినేని హీరో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి అభిమానులు తక్కువేమీ కాదు. ఇక షోలోని కంటెస్టెంట్లు నామినేషన్స్, టాస్కులు, గోడలు ఇలా ప్రతీదాంట్లో రచ్చరంబోలా చేస్తుంటారు. అయితే ఇంత క్రేజ్ ఉన్నప్పటికీ దేశంలో పలు భాషల్లో ప్రసారమవుతున్న ఈ బిగ్‌బాస్ షోలకు మరోవైపు వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో వినిపిస్తోంది. కన్నడ హీరో కిచ్చా సుదీప్ఈ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నకన్నడ బిగ్‌బాస్ షోపై కూడా ఇటీవల తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఈ షో స్టూడియోను అధికారులు ఏకంగా సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు బిగ్‌బాస్ షో కూడా పీకల్లోతు చిక్కుల్లో పడింది. ఇంతకీ సంగతేమంటే..
ఈ షోపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు నమోదైంది. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఈ షోపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణకు చెందిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా టీవీలో ప్రసారం అవుతున్న తెలుగు బిగ్ బాస్ షో పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ కు చెందిన కమ్మరి శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్ర శేఖర్, శ్రీనివాస్ అనే వ్యక్తులు ఫిర్యాదు చ ఏశారు. బిగ్ బాస్ షో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశారు. బిగ్ బాస్ షో కు సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని, కనీసం కుటుంబ విలువలు పాటించని వారిని బిగ్ బాస్ టీం ఎంచుకుంటున్నట్లు ఆరోపించారు.
సమాజం సిగ్గు పడే విధంగా బిగ్ బాస్ నిర్వాహకులు షో నిర్వహిస్తున్న ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే బిగ్ బాస్ షో ను నిలిపివేయాలని, బిగ్ బాస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. లేకపోతే బిగ్ బాస్ హౌస్ ను ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్ణాటక లో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చెయ్యాలని, నాగార్జున సమాజానికి ఉపయోగ పడే కార్యక్రమాలు చెయ్యాలని హితవు పలికారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వారిని సెలక్ట్ చేసుకొని బిగ్ బాస్ సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని యువత ప్రశ్నిస్తున్నారు
Also read
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో
- విదేశీ అమ్మయిలతో వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
- ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకున్న.. ఉజ్మా
- మేడ్చల్ కాల్పుల ఘటన.. ఇబ్రహీం సహా ఇద్దరు అరెస్ట్