SGSTV NEWS
CrimeNational

Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత  బిగ్ ట్విస్ట్!


బెంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనస్థీషియా ఇచ్చి  కట్టుకున్న భార్యను హత్య చేశాడో డాక్టర్ భర్త. అనంతరం ఆమెది సహజ మరణమని అందర్ని నమ్మించాడు.  కానీ 6 నెలల తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది.


బెంగళూరులో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనస్థీషియా ఇచ్చి  కట్టుకున్న భార్యను హత్య చేశాడో డాక్టర్ భర్త. అనంతరం ఆమెది సహజ మరణమని అందర్ని నమ్మించాడు.  కానీ 6 నెలల తర్వాత అసలు నిజం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..   విక్టోరియా ఆస్పత్రిలో డాక్టర్లుగా కృతికా, మహేంద్ర రెడ్డి సేవలు అందించేవారు. డెర్మటాలజిస్ట్‌గా కృతికా, జనరల్‌ సర్జన్‌గా మహేంద్రరెడ్డి తమ డ్యూటీలు చేసేవారు.


కృతికాకు ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్‌
2024 మే 26న కృతికా, మహేంద్ర రెడ్డి వివాహం జరిగింది. అయితే  కృతికాకు షుగర్‌ వంటి అనారోగ్య సమస్యలున్నాయి. ఈ క్రమంలో 2025 ఏప్రిల్‌ 23న తండ్రి నివాసంలో కుప్పకూలిపోయింది కృతికా. ఆ సమయంలో కృతికాకు ఇంట్రావీనస్‌ ఇంజెక్షన్‌ ఇచ్చాడు మహేంద్ర.  చికిత్స కోసమే ఆ ఇంజెక్షన్‌ ఇచ్చినట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిపాడు. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కృతికా చనిపోయింది. అయితే కృతికా అక్క  రేడియాలజిస్ట్ అయిన డాక్టర్ నికితా ఎం రెడ్డికి  అనుమానం రావడంతో ఆమె  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఆరు నెలల తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) రిపోర్టులో కృతికా బాడీలో ప్రొపోఫోల్‌ అనే మత్తుమందు ఉన్నట్లుగా తేలింది.  కృతిక మత్తుమందు సమ్మేళనం కారణంగా మరణించిందని నిర్ధారించింది. భార్యను హత్య చేశాక మణిపాల్‌కు పరారైన నిందితుడు మహేంద్రను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. అతనిపై ఇప్పటికే లుక్-అవుట్ సర్క్యులర్ (LOC) జారీ చేయబడింది. హత్యను అమలు చేయడానికి మహేంద్ర తన వృత్తిపరమైన OT,  ICU మందులను ఉపయోగించుకున్నాడని,  తరువాత దానిని సహజ మరణంగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.

Also read

Related posts