SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: పైకి బుద్దిమంతుడిలా ఉన్నాడనుకునేరు.. వెనుక కథ వేరే ఉంది.. అసలు మ్యాటర్ తెలిస్తే



ఆమె ఓ పోలీస్ కానిస్టేబుల్.. అతడు రైల్వే ఉద్యోగి.. భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే భర్తపై ఎక్కడో భార్యకు ఓ అనుమానం.. పరాయి స్త్రీలతో సన్నిహితంగా ఉంటున్నాడు అన్నది భార్య అనుమానం. అనుమానం బలపడడంతో ఏకంగా భర్తనే కిడ్నాప్ చేసింది ఆ భార్య.


శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎన్జీవో కాలనీకి చెందిన ప్రవీణ్.. చిత్తూరు జిల్లాకు చెందిన మంజులకు ఐదు సంవత్సరాల క్రితం పెళ్లయింది. పెళ్లయిన దగ్గర నుంచి భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్య మంజుల తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. భర్త ప్రవీణ్ కాలసముద్రంలో రైల్వే ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ వేరువేరు ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం వల్ల మనస్పర్ధలు పెరిగి.. భర్త ప్రవీణ్‌పై భార్య మంజులకు అనుమానం మొదలైంది. తన భర్త ప్రవీణ్ మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న అనుమానంతో భార్య మంజుల ఏకంగా రెండు కార్లలో 15 మంది వ్యక్తులతో కదిరిలో ఉంటున్న భర్త ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసింది.



భర్తతో పాటు ఇంట్లో పని చేస్తున్న పని మనిషిని కూడా భార్య మంజుల తీసుకెళ్లింది. భర్తని కిడ్నాప్ చేస్తుండగా అడ్డొచ్చిన అత్తమామలకు రెండు తగిలించింది భార్య మంజుల. దీంతో ప్రవీణ్ తల్లిదండ్రులు కదిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భర్తను భార్య కిడ్నాప్ చేయటం ఏంటి.? అందులోనూ మంజుల పోలీస్ కానిస్టేబుల్.. భర్తపై ఉన్న అనుమానంతోనే భార్య మంజుల కిడ్నాప్ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కిడ్నాప్ వ్యవహారాన్ని కదిరి పోలీసులు తిరుచానూరు పోలీసులకు కానిస్టేబుల్ మంజుల తీరుపై సమాచారం ఇచ్చారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తూ కిడ్నాప్ చేయటం ఏంటి.? అందులోనూ కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయడం విడ్డూరంగా ఉంది కదా..!

Also read

Related posts