SGSTV NEWS online
CrimeTelangana

Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..


చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ  సంఘటన అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.


Crime News:: పిల్లలు చదువుకోకుండా టీవీలు, సెల్‌ఫోన్లు చూస్తూ సమయం వృథా చేస్తున్నారని తల్లిదండ్రులు బాధపడటం సహజం. అప్పుడప్పుడు వారిని మందలించడం కూడా తప్పదు. అయితే చదువుకోకుండా ఇంటి వద్దనే ఉన్న కుమార్తెను చదువుకోమని తల్లి మందలించడమే తప్పయింది. మనస్థాపంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ  సంఘటన అంబర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన రమేష్‌, జ్యోతి దంపతులు. వీరు గత ఏడు నెలలుగా అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె వైష్ణవి(17), ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతూ  మానేసింది. ఇంట్లోనే ఖాళీగా ఉంటుంది. అయితే ఈనెల 12న ఉదయం జ్యోతి తన కుమార్తె వైష్ణవిని ఇంట్లో ఖాళీగా ఉండకుండా చదువుకోమని కాలేజీకి వెళ్లమని మందలించింది.

అనంతరం తాను చేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగానికి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తల్లి  ఎంతసేపు తలుపులు కొట్టినా తెరవలేదు. వైష్ణవిని పిలిచానా పలకలేదు. దీంతో ఇంటి పక్క వారిని పిలిచి తలుపులు పగలగొట్టి చూడగా ఇంట్లోని ఫ్యాన్‌కు వైష్ణవి చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి  కనిపించింది. వెంటనే 108కు కాల్‌ చేసి పిలిపించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. కన్నబిడ్డను చదువుకోమని చెప్పడమే తప్పయిందని జ్యోతి కన్నీటి పర్యంతమైంది. ఆమె  ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తరుణ్‌కుమర్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Related posts