ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది. తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది
Daughter And Fathers Bond: ప్రతి ఇంటిలో ఆడపిల్లలకు తల్లిమీదకంటే తండ్రి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తల్లితో చెప్పుకోలేనివి కూడా తండ్రితో చెప్పుకుంటారు ఆడపిల్లలు. తండ్రిని ఒక స్నేహితునిలా భావిస్తారు. తండ్రి కూడా మగపిల్లల్ని ఎంత తిట్టినా, కొట్టినా ఆడపిల్లల్ని మాత్రం గారాబం చేస్తుంటారు. అందుకే ఆ బాండింగ్ ప్రత్యేకం. పెళ్లి చేసి అత్తారింటికి పంపే సమయంలో తల్లి కంటే తండ్రే ఎక్కువగా దుఃఖిస్తాడు.అందుకే నేను మా డాడీ బిడ్డను అని చెప్పుకుంటూ ఆగపిల్లలు ఆనందం వ్యక్తం చేస్తుంటారు. డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ చెప్పుకుని మురిసిపోతుంటారు. అలాంటి ఓ యువతి తండ్రి మీద ప్రేమతో ఏకంగా ప్రాణాలే తీసుకుంది.
సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్లోని గౌరీ బిద్నూర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల స్వర్ణ బెంగళూరులోని మహారాణి కాలేజీలో ఎమ్ఎస్సీ చదువుతోంది. ఆమెకు తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. స్వర్ణ అంటే కూడా ఆ తండ్రికి ఎంతో ఇష్టం. అలాంటిది గడచిన 3 నెలల క్రితం ఆమె తండ్రి ఆమె ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ప్రాణంగా భావించే తండ్రి చనిపోవటంతో స్వర్ణ తట్టుకోలేకపోయింది. తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఎపుడు చలాకీగా ఉండే స్వర్ణ తన కలల ప్రపంచం కుప్పకూలినట్లు అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం ఆమె ఉంటున్న హాస్టల్ గదిలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హాస్టల్ సిబ్బంది ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే స్వర్ణను బతికించడానికి చిక్కబళ్లాపూర్ జిల్లా ఆస్పత్రి వైద్యులు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలేవి ఫలించలేదు. చికిత్స పొందుతున్న సమయంలోనే స్వర్ణ ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. కూతురి మృతితో ఆ తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. నాలుగు నెలల్లో భర్త, కూతుర్ని పోగొట్టుకున్న తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. స్వర్ణ సోదరుడి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఓ వైపు తండ్రిని, మరోవైపు సోదరిని పోగొట్టుకుని దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. ఈ సంఘటనపై బెంగళూరు హైగ్రౌండ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also read
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!
- చనిపోయిన తండ్రిని మరిచిపోలేక.. ఆయన కోసం..