చిత్తూరు రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ వినుత కోటా డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. గత కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన డ్రైవర్ శ్రీనివాసులు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో రాయుడు సంచలన విషయాలను ప్రస్థావించాడు. 2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో టచ్ లో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
చిత్తూరు రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారిన శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇంచార్జ్ వినుత కోటా డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. గత కొన్ని రోజుల క్రితం హత్యకు గురైన డ్రైవర్ శ్రీనివాసులు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయుడు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ప్రకారం.. 2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో టచ్ లో ఉన్నానని, జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్ రెడ్డి ద్వారా తాను ఎమ్మెల్యేతో పరిచయమైందని రాయుడు చెప్పుకొచ్చాడు.
వినూత కోటాకి సంబంధించి రాజకీయ పరమైన వ్యక్తిగత పరమైన అన్ని విషయాలు నవంబర్ 2023 నుండి సుధీర్ రెడ్డికి చేరవేసినందుకు 2024 ఎన్నికల ఫలితాల ముందు తనకి 20 లక్షలు ఇచ్చారని స్పష్టం శ్రీనివాసులు వీడియోలో స్పష్టం చేశాడు. అంతేకాదు శ్రీనివాస్ చెప్పిన మరో సంచలన విషయం ఏమిటంటే వినుత కోటా, చంద్రబాబు కోటా లని చంపాలని ఎమ్మెల్యే ఆదేశించాడని, అతని ఆదేశాలతో రెండు సార్లు కారు ఆక్సిడెంట్ చెయ్యడానికి ప్రయత్నించి విఫలమైనట్టు చెప్పుకొచ్చాడు.
రాయుడు వీడియోలో చెప్పిన మరో షాకింగ్ అంశం.. నేరుగా బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చి తనను కలిసి వినుత కోటా, చంద్రబాబు కోటా ప్రైవేట్ వీడియోలు తియ్యాలని బెదిరించినట్టు శ్రీనివాసులు చెప్పుకొచ్చాడు. అందుకోసం తనకు మరో రూ. 30 లక్షలు డబ్బులు ఆశ చూపినట్టు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే బెడ్రూంలో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయాయని శ్రీనివాసులు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు.
డ్రైవర్ శ్రీనివాసులు విడుదల చేసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో శ్రీకాళహస్తి ప్రాంతంలో కలకలం రేగింది. సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్న ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
వీడియో చూడండి
