మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజిపల్లి దగ్గర దారుణం చోటుచేసుకుంది. కూలి పని కోసం వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది
మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కూలి పని కోసం వచ్చిన ఓ గిరిజన మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం (గ్యాంగ్ రేప్) చేసి.. అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. జనకంపల్లి పంచాయతీలోని ఓ తండాకు చెందిన మహిళ శుక్రవారం ఉదయం కూలీ పనుల కోసం మెదక్ వచ్చింది. అక్కడ పనుల కోసం వేచి చూస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు పని ఇప్పిస్తామని నమ్మబలికి.. కొల్చారం మండలం అప్పాజిపల్లి శివారులోని ఏడుపాయల రోడ్డు వైపు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
గ్యాంగ్ రేప్..
అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత హత్యాయత్నం చేసి.. ఆపై ఆమెను నగ్నంగా మార్చి.. రెండు చేతులు చిన్న స్తంభానికి కట్టి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రంతా ఆ నిర్మానుష్య ప్రాంతంలోనే అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని, శనివారం ఉదయం అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు శనివారం రాత్రి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఈ కిరాతకానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- బ్రహ్మ ముహూర్తమే కాదు.. సాయంత్రం ఈ గంటలో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం, రాజయోగం కలుగుతాయట!
- నిజ జ్యేష్ఠ మాసం మొదలు.. ఈ పూజలు, దానాలు చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం మీ సొంతమట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పాము కాటు.. తండ్రి పగ.. కొడుకును చంపిన త్రాచును వేటాడి చంపాడు.. ఎక్కడంటే..
- ఏంటక్కా మరీ ఇలా ఉన్నావ్.. స్కెచ్ వేసింది.. సైలెంట్‌గా సెలైన్‌తో పనికానిచ్చేసింది





