SGSTV NEWS
CrimeTelangana

ఇంజనీరింగ్ పాఠాలు అర్థం కావట్లేదని దారుణం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..



ఓ వైపు పాఠాలు అర్థం కావట్లేదు.. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవడం ఇష్టం లేదు.. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు.. తన బాధను ఎవరికీ చెప్పలేక.. దారుణ నిర్ణయం తీసుకుంది.. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది..

ఓ వైపు పాఠాలు అర్థం కావట్లేదు.. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదవడం ఇష్టం లేదు.. దీంతో మనస్తాపం చెందిన ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు.. తన బాధను ఎవరికీ చెప్పలేక.. దారుణ నిర్ణయం తీసుకుంది.. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని.. విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్‌ గ్రామానికి చెందిన కృష్ణాకర్‌ చిన్న కుమార్తె కీర్తన (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఇంజనీరింగ్ (బీటెక్‌) మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే, కీర్తన కొంతకాలంగా లెక్చరర్లు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని ఆవేదన చెందుతోంది. మరోవైపు తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక బాధపడుతోంది.

ఇదే విషయాన్ని కీర్తన పలుమార్లు తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పి.. బాధపడుతూ ఉండేది. అయితే.. కుమార్తె బాధ చూడలేని తల్లిదండ్రులు ఆమెను సముదాయించారు.. అంతేకాకుండా.. కీర్తనను మరో కాలేజీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కీర్తన దసరా సెలవుల్లో భాగంగా ఇంటికివచ్చింది..

ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ.. కీర్తన శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అయితే.. సరిగ్గా ఆమె ఉరేసుకునే సమయంలో ఇంటికొచ్చిన తండ్రి కృష్ణాకర్‌ కీర్తనను.. గమనించి ఆసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. అప్పటికే.. కీర్తన మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు

Also read

Related posts