తిరుపతి శ్రీకాళహస్తిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. భార్య కాపురానికి రాలేదని ఓ భర్త కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలతో పడిఉన్న బాధితుడిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఇటీవల కాలంలో జనాలు చిన్న చిన్న సమస్యలకే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్య కాపురానికి రావట్లేదని ఇటీవలే ఒక వ్యక్తి చెట్టుకు ఉరికేసుకొని ఆత్మహత్యకు పాల్పడగా తాజాగా శ్రీకాలహస్తిలో మరో వ్యక్తి కూడా అదే కారణంతోని గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రగాయాలతో రక్తపుమడుగులో పడిఉన్న బాధితుడిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తికి పట్టానికి చెందిన నరసింహ అనే వ్యక్తిలో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవల భార్యభర్తల కొన్ని గొడవలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన నరసింహ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసింది. కత్తితో గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
అప్పుడే ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు రక్తపు మడుగులో పడి ఉన్న నరసింహను చూసి షాక్ అయ్యారు. వెంటనే అంబులెన్స్ సహాయంతో స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించారు. అక్క నరసింహను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం నరసింహా ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!