SGSTV NEWS
Andhra PradeshCrime

Indrakeeladri: దుర్గగుడిలో కిడ్నాప్ యత్నం.. బాలుడిని రక్షించిన తల్లిదండ్రులకు అప్పగించిన ఏఎస్‌ఐ

 

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కిడ్నాప్ కలకలం రేపుపింది. ఆలయంలో ఒంటరిగా ఉన్న ఒక బాలుడిని చూసి ఆగంతకుడు అమాంతం బాలుడిని ఎత్తుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ ఏఎస్‌ఐ సత్యనారాయణ కంటపడ్డారు. దీంతో నిందితులు బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయారు. అగంతకుల చర నుంచి బాలుడిని రక్షించిన ఏఎస్‌ల చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.


విజయవాడ దుర్గగుడిలో ఆదివారం ఓ బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆలయంలో ఒంటరిగా కనిపించిన బాలుడిని అగంతకులు కిడ్నాప్ చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఫైర్ విభాగంలో విధులు నిర్వహించే ఏఎస్ఐ సత్యనారాయణ కండపడ్డారు. అనుమానాస్పదంగా ఉన్న అగంతుకులును చూసిన ఏఎస్‌ఐ వారి దగ్గరకు వెళ్లాడు. అది గమనించిన అగంతకులు ఆ బాలుడిని వదిలి పారిపోయారు. దీంతో బాలుడిని అదుపుఉలోకి తీసుకున్న ఏఎస్‌ఐ.. ఈవో శీనా నాయక్ చైర్మన్ గాంధీ సమక్షంలో తప్పిపోయిన బాలుడి కోసం వెతుకుతున్న వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్ఐ సత్యనారాయణను దుర్గగుడి అధికారులు అభినందించారు.

వివరాల్లోకి వెళ్తే.. జగ్గయ్యపేటకు చెందిన లావణ్య అనే మహిళ తన 4 ఏళ్ల బాలుడు శశి వజ్ర ఆరూష్‌తో కలిసి ఆదివారం దుర్గమ్మ దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ఏడవ అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరూష్ తల్లికి దూరమయ్యాడు. లావణ్య తన కుమారుడి కోసం మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు. కనపడకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదే సమయంలో, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఫైర్ డిపార్ట్‌మెంట్ ఏఎస్ఐ RV.సత్యనారాయణ అమ్మవారి దర్శనానికి వచ్చారు. లిఫ్ట్ వద్దకు వెళ్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఒక బాలుడిని బలవంతంగా తీసుకెళ్తుండగా, ఆ బాలుడు గట్టిగా ఏడుస్తూ కనిపించాడు.

అనుమానం వచ్చిన ఏఎస్ఐ సత్యనారాయణ ఆ వ్యక్తులను ప్రశ్నించారు. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు బాలుడిని వదిలి పారిపోయారు. ఇక బాలుడిని తన వద్దకు తీసుకున్న ఏఎస్ఐ సత్యనారాయణ, వెంటనే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శ్రీనివాస్ నాయక్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణను ఆశ్రయించి, జరిగిన విషయాన్ని వివరించారు. అధికారులు వెంటనే స్పందించి, బాలుడి తల్లి లావణ్యను గుర్తించి, వారి సమక్షంలో బాలుడు శశి వజ్ర ఆరూష్‌ను తల్లికి సురక్షితంగా అప్పగించారు. సమయస్ఫూర్తితో బాలుడిని కాపాడిన ఏఎస్ఐ కె.వి.సత్యనారాయణను ఆలయ ఈఓ, చైర్మన్ అభినందించారు. భక్తులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు

Also read

Related posts