పొరుగింట్లో చోరీకి యత్నించిన దొంగను అడ్డుకుని వెంబడించింది ఓ బాలిక. అందుకు సంబంధించిన సీసీ టీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవతున్నాయి. దొంగను చూసి ఏమాత్రం జంకకుండా వెంబడించిన బాలికను పోలీసులు అభినందించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..
హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న వయస్సులోనూ అసాధారణ ధైర్యం చూపిన ఓ బాలిక అందరి ప్రశంసలు అందుకుంటోంది.వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ జిల్లా చింతల్‌లోని భగత్‌సింగ్ నగర్‌లో గురువారం మధ్యాహ్నం ఓ వ్యక్తి చోరీకి యత్నించాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. దొంగ పక్కా ప్లాన్ వేసుకుని వచ్చాడు. తాళాలు వేసి లేని ఇంటి తలుపు తెరిచి లోపలికి దూరాడు. అయితే అదే ఇంటి పై భాగంలో నివసిస్తున్న 13 ఏళ్ల భవాని అనే బాలిక కింద నుంచి వస్తున్న అనుమానాస్పద శబ్దాలను గమనించింది. వెంటనే దిగివచ్చి చూసేసరికి అపరిచితుడు ఇంట్లో తిరుగుతున్నాడు. ఎవరూ లేని ఇంట్లోకి వచ్చి ఏం చేస్తున్నావని ఆమె ప్రశ్నించగా, దొంగ ఒక్కసారిగా భయపడి పరుగు తీశాడు.
దీంతో బాలిక భవాని ధైర్యంగా కేకలు వేస్తూ అతన్ని వీధి చివర దాకా వెంబడించింది. ఆమె కేకలు విన్న స్థానికులు బయటకు వచ్చేసరికి దొంగ తప్పించుకున్నాడు. అయితే ఆ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత చింతల్ పోలీసులు ఆ బాలిక ధైర్యాన్ని అభినందించారు. చిన్న వయస్సులోనూ భయపడకుండా దొంగను ఎదుర్కొని తరిమేయడం అసాధారణం అంటూ ప్రశంసించారు. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను ఆధారంగా తీసుకుని దొంగను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు.భవాని ధైర్యసాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.
Also read
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?