కామంతో కళ్లు మూసుకుపోయిన మగ రాక్షసులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండానే తెగిస్తున్నారు
Crime News : కామంతో కళ్లు మూసుకుపోయిన మగ రాక్షసులు రెచ్చిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చిన్నారుల జీవితాలను చిదిమేస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండానే తెగిస్తున్నారు. హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఓ రాక్షసుడు ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజానికి ఈ ఘటన జరిగి 15 రోజులు అవుతుండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి… నగరంలోని సైదాబాద్ ఓ కుటుంబం నివసిస్తోంది. వారికి కూతురు(8), కుమారుడు(7) ఉన్నారు. రోజువారి కూలీపనులు చేసుకుంటూ ఆ కుటుంబం పొట్ట గడపుకుటుంది.కూలీ పనులతోనే కుటుంబాన్ని దంపతులు పోషించుకుంటున్నారు. అయితే ఆ దంపతులిద్దరూ కూలీ పనులకు వెళ్లిన సమయంలో,వారి యువకుడు ఆ ఇద్దరు చిన్నారులను ఇంటికి పిలిచాడు. అసలేం జరుగుతుందో తెలియని ఏడేళ్ల సోదరుడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అనంతరం ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని చిన్నారులను బెదిరించాడు నిందితుడు.
అయితే రోజు చలాకీగా ఉండే అమ్మాయి నీరసంగా ఉండటంతో పాటు అనారోగ్యానికి గురవ్వడంతో తల్లిదండ్రులు ఆందోళనతో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ విషయం బయట పడింది. ఈ విషయం గురించి తల్లిదండ్రులు పిల్లలను ఆరా తీయగా తల్లిదండ్రులకు జరిగిన వాస్తవాన్ని చెప్పాడు చిన్నారి తమ్ముడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన సదరు నిందితుడు అక్కడి నుంచి పారి పోయాడు. కాగా నిందితుడి కోసం సైదాబాద్ పోలీసులు గాలిస్తున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!