SGSTV NEWS
CrimeNational

చీరల దుకాణంలో చీకటి పడితే చాలు రోజు మీటింగ్‌లే.. ఆరా తీస్తే.. బయటపడ్డ టెర్రర్ లింక్!



మహారాష్ట్రలో వేళ్లూనుకున్న టెర్రర్ నెట్‌వర్క్.. 2008లో బైటపడ్డ ISIS మాడ్యుల్.. ఇప్పుడిప్పుడే గుట్టు వీడిపోతోంది. ఒక్కణ్ణి పట్టుకుని గట్టిగా కొడితే 18 మంది అనుమానిత టెర్రరిస్టుల ఆచూకీ తెలిసింది. అందరి కేరాఫ్ పూణే. వీళ్లు ఇంకా ఏమేం కుట్రలు చేశారు.. ఎక్కడెక్కడ పేలుళ్లకు స్కెచ్చేశారు..?


మహారాష్ట్రలో వేళ్లూనుకున్న టెర్రర్ నెట్‌వర్క్.. 2008లో బైటపడ్డ ISIS మాడ్యుల్.. ఇప్పుడిప్పుడే గుట్టు వీడిపోతోంది. ఒక్కణ్ణి పట్టుకుని గట్టిగా కొడితే 18 మంది అనుమానిత టెర్రరిస్టుల ఆచూకీ తెలిసింది. అందరి కేరాఫ్ పూణే. వీళ్లు ఇంకా ఏమేం కుట్రలు చేశారు.. ఎక్కడెక్కడ పేలుళ్లకు స్కెచ్చేశారు..? అతి త్వరలో తేలుతుందంటోంది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.

స్థానిక పోలీసులు, ముంబై నుంచి వచ్చిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఢిల్లీ నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు కలిసి బుధవారం (అక్టోబర్ 8) అర్థరాత్రి తర్వాత పూణే మొత్తాన్ని రౌండప్ చేశాయి. అశోక్ మ్యూస్ సొసైటీ, కొంధ్వా, ఖడక్, వన్వాడీ, భోశారి ఇలా మొత్తం 19 ప్రాంతాల్లో అనుమానాస్పదం అనిపించిన అన్ని ఇళ్లు, కార్యాలయాలపై ఆకస్మిక దాడులు జరిగాయి. చీరలమ్మే దుకాణాలు కూడా టెర్రర్ ఫండింగ్ కేంద్రాలుగా మారినట్టు తేలింది.

పూణేలో నిషేధిత టెర్రర్ గ్రూప్ ఇండియన్ ముజాహిదీన్‌, ఐసిస్ కదలికల్ని గతంలోనే పసిగట్టాయి నిఘా సంస్థలు. కొంధ్వా ప్రాంతంలోనే కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసుకుని, టెర్రర్ కార్యకలాపాలకు స్కెచ్ వేస్తున్నారన్నది 2008లో పెద్ద సంచలనమైంది. పదిహేడేళ్లుగా ఈ ప్రాంతంపై ఓ కన్నేసి ఉంచిన ATS.. రెండేళ్ల కిందట ముంబై అర్థర్‌రోడ్‌ జైల్లో ఉన్న తల్హా లియాఖత్ అనే ఐసిస్ తీవ్రవాదిని అదుపులోకి తీసుకుంది. అతడిచ్చిన సమాచారం మేరకు ఇప్పుడు పూణేపై విరుచుకుపడింది.

కొందరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోనికి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ATS అధికారులు. సీజ్ చేసిన కొన్ని డాక్యుమెంట్లు, 18 మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లను డీకోడ్ చేస్తున్నారు. ఒక్కసారిగా వేలాదిమంది పోలీసులు 19 ప్రాంతాల్లో దాడులకు దిగడంతో పూణేలో జనమంతా హైరానా పడ్డారు. పూణే ఐసిస్ మాడ్యూల్‌ని ఛేధించే క్రమంలో ఇది అతిపెద్ద డెవలప్‌మెంట్.

Also read

Related posts