ఆంధ్రాకు చెందిన వ్యాపారి అరెస్ట్
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్కు చెందిన 24 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి తన స్వస్థలం ఈరోడు కుర్లా ఎక్స్ప్రెస్ రైల్లో రిజర్వ్ కంపార్ట్మెంట్లో ప్రయాణిస్తోంది. బుధవారం ఉదయం రైలు ధర్మపురి దాటినప్పుడు, ఓ వ్యక్తి ఆ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. షాక్కు గురైన మహిళ కేకలు వేయగా, తన తోటి ప్రయాణికుల సాయంతో ఆ వ్యక్తిని ఆమె పట్టుకుంది. తర్వాత రైలు బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సేలం రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న రైల్వే పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన శంకర్(45)గా గుర్తించారు. వస్త్ర వ్యాపారం కోసం ఈరోడ్ కు వచ్చినట్లు తేలింది.
Also read
- నేటి జాతకములు..15 అక్టోబర్, 2025
- Karthika Masam 2025: కార్తీక మాసంలో.. నదీ స్నానం చేయడం వెనక ఆంతర్యం ఏమిటి ?
- Kubera Temple: మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా.. ఒక్కసారి దర్శించుకున్నా.. జీవితంలో డబ్బుకి ఇబ్బందే ఉండదు..
- TG News: తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!