SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: పాపం ఎంత కష్టమొచ్చిందో.. 13 ఏళ్ల కొడుకు ముందే తల్లి బలవన్మరణం.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన..

మద్యానికి బానిసైన భర్త, అనారోగ్యంతో బాధపడుతున్న కొడుకు, ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఆ తల్లిని మానసికంగా కుంగదీశాయి. కనీసం కొడుకుకు వైద్యం కూడా చేయించలేకపోతున్నాననే తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది.13 కుమారుడి ఎదుటే బలవన్మరణానికి పాల్పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన కళ్లముందే తల్లి ఉరివేసుకోవడం చూసిన ఆ బాలుడు గుండెలు పగిలేలా రోధించాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే… ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన నర్సింహ, సుధ అనే దంపతులు 15 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ నగరానికి వలస వచ్చి ఎల్బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. చిన్న బాబుకు 13 ఏళ్లు, పెద్దబాబుకు 15 ఏళ్లు. చిన్నబాబు బాల్యం నుంచే మదుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నడుపుతున్న నర్సింహా కొన్నాళ్లు మద్యానికి బానిసై పనిచేయడం మానేశాడు. దీంతో అప్పటి నుంచి ఇళ్లలో పనిచేస్తూ సుధనే కుటుంబాన్ని నెట్టుకొస్తుంది.

ఆర్థిక సమస్యల కారణంగా చిన్న కుమారుడికి వైద్యం చేయించలేకపోతున్నానని సుధ చాలా సందర్భాల్లో పక్కింటి వాళ్లతో చెప్పి బాధపడేది. ఎలాగైనా డబ్బులు పొగు చేసి కుమారుడికి వైద్యం చేయించాలని ఆ తల్లి కలలు కనేది. ఇదిలా ఉండగా ఇటీవల పెద్దకుమారు పక్కింట్లో వస్తువులు చోరీ చేసి దొరికిపోయాడు.దీంతో ఆ ఇంటి యజమానికి మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి సంచలన నిర్ణయం తీసుకుంది. పెద్ద కొడుకును బజారుకి పంపి.. ఇంట్లో ఉన్న చిన్న కొడుకు చూస్తుండగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

తల్లి ఉరివేసుకోవడం చూసిన 13 ఏళ్ల చిన్న కుమారుడు ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఇంతలో ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు వెంటనే స్థానికులను సహాయంతో తల్లి కిందకు దించి హాస్పిటల్‌కు తరలించాడు. కానీ అప్పటికే సుధ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ఇద్దరు బాలురు కన్నీరు మున్నీరుగా విలపించారు. అటు తండ్రి పట్టించుకోక, ఇటు తల్లి లేక ఇప్పుడు ఆ ఇద్దరు బాలురు పరిస్థితి తలుచుకుంటే కన్నీళ్లు ఆగట్లేదు

Also read

Related posts