SGSTV NEWS
CrimeTechnology

మైనర్ బాలికను రూమ్‌‌కు తీసుకెళ్లిన యువకుడు.. ఇంతలోనే అనుకోని ఘటన!



నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హతమార్చాడు దుండగుడు. నల్లగొండ ఐటీఐ కాలేజీ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల మైనర్ బాలిక డైట్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలోనే గుట్ట కింద అన్నారంకు చెందిన టాక్టర్ డ్రైవర్‌ గడ్డం కృష్ణతో పరిచయం ఏర్పడింది.


నల్లగొండలో దారుణం జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యంత పాశవికంగా హతమార్చాడు దుండగుడు. నల్లగొండ ఐటీఐ కాలేజీ వద్ద జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. నల్లగొండ మండలం అన్నరెడ్డి గూడెంకు చెందిన 17ఏళ్ల మైనర్ బాలిక కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే గుట్ట కింద అన్నారంకు చెందిన టాక్టర్ డ్రైవర్‌ గడ్డం కృష్ణతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. ఇదే అదునుగా భావించి యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడి, హతమార్చాడు కృష్ణ. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలికతో ఏర్పడ్డ పరిచయంతో మధ్యాహ్నం కాలేజీ తర్వాత విద్యార్థినిని తీసుకుని ఆటోలో బయలుదేరాడు కృష్ణ. డైట్ కాలేజీ వెనక ఉన్న తన స్నేహితుడు ఆటో డ్రైవర్ మధు రూమ్ కు ఇద్దరు వచ్చారు. ఏకాంతంగా ఉన్న ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ విద్యార్థిని విగత జీవిగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో టూ టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థిని బంధువులు తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని కృష్ణ.. అత్యాచారం చేసి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. ఇంటర్ విద్యార్థి మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టూ టౌన్ ఇన్చార్జి సీఐ రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు. రూమ్ కు కలిసి వచ్చిన కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

Also read

Related posts