SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: అయ్యో.. కొత్త బైక్ రూపంలో యమపాశం.. అప్పు చేసి కొనిచ్చిన రెండ్రోజులకే..



ఆ యువకుడి పేరు హరీష్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. దీంతో తనకు బైక్‌ కొనివ్వాలని ఇంట్లో వాళ్లపై ఒత్తిడి తెచ్చాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఇక చేసేదేమి లేక పేరెంట్స్‌ అప్పుచేసి మరి కొత్తబైక్ కొనిచ్చారు. కానీ కొన్ని రెండ్రోజులకే కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఇంతకు ఏం జరిగిందో చూద్దాం పదండి.


తనకు కొత్త బైక్ కావాలని.. కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన కుమారుడు.. కొత్తబైక్‌ కొన్న రెండ్రోజులకే తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటన విశాఖపట్నం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాణిపేటకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీనివాస్ దంపతులకు హరీష్ అనే 19 కుమారుడు ఉన్నారు. హరీష్ ఇటీవలే ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఫ్రెండ్స్ అందరూ బైక్స్‌ కొనడంతో తనకు కొత్త బైక్‌ కొనివ్వాలని హరీష్ కొన్నాళ్లుగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చాడు. కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.


దీంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. చేసేదేమి లేక తల్లిదండ్రులు ఇతరులతో రూ.3లక్షలు అప్పుగా తెచ్చి దసరా పండుగ రోజు హరీష్‌కు కొత్త బైక్‌ కొనిచ్చారు. దీంతో హరీష్‌ సంతోషంతో గంతులు వేశాడు. తన బైక్‌ను ఫ్రెండ్స్‌ అందరికీ చూపించి తెగ మురిసిపోయాడు. కానీ ఈ ఆనందం హరీష్‌కు రెండు రోజులు కూడా ఉండలేదు. బైక్‌ కొన్న రెండ్రోజులకే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

ఉదయం టిఫిన్ చేసేందుకని స్నేహితుడితో కలిసి ద్వారకానగర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా అదుపు తప్పి బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో హరీష్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ హరీష్‌ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also read

Related posts