మధ్యవర్తి ఆధ్వర్యంలో పెళ్ళి చూపులు జరిగాయి. తొలి చూపులోనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అబ్బాయిని ఇష్టపడింది. అయితే ఇద్దరి పెళ్ళికి అమ్మాయి తరుపు పెద్దలు ఒప్పుకోలేదు. అయినా వాళ్ళిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. అయితే.. వారిద్దరూ వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడని అమ్మాయి సోదరుడు..
మధ్యవర్తి ఆధ్వర్యంలో పెళ్ళి చూపులు జరిగాయి. తొలి చూపులోనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా అబ్బాయిని ఇష్టపడింది. అయితే ఇద్దరి పెళ్ళికి అమ్మాయి తరుపు పెద్దలు ఒప్పుకోలేదు. అయినా వాళ్ళిద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. అయితే.. వారిద్దరూ వివాహం చేసుకోవడాన్ని ఇష్టపడని అమ్మాయి సోదరుడు అదును చూసి ఆ అబ్బాయిని హత్య చేశాడు. దీంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదిస్తోంది.. కట్టుకున్న వ్యక్తిని కడతేర్చడంతో.. ఆ అమ్మాయి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది..
వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బుడంపాడుకు చెందిన నాగ గణేష్ విద్యుత్ శాఖలో పని చేస్తున్నాడు. నాలుగైదు నెలల క్రితం గణేష్ కొలుపుల నిమిత్తం రెడ్డిపాలెం వెళ్ళాడు. అక్కడ కొలకలూరికి చెందిన అంజలి దేవిని గణేష్ బాబాయి చూపించాడు. సంబంధం మాట్లాడమంటావా..? అని గణేష్ ని అడిగాడు. అయితే అమ్మాయి తరుపు బంధువులు గణేష్, అంజలి దేవిల పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో ఇంతటితో పెళ్ళి ఆగిపోయిందని ఇరు వర్గాల వాళ్ళు అనుకున్నారు. అయితే గణేష్, అంజలీ దేవిల మధ్య మొదటి చూపులోనే ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకునేవారు.. ఈ క్రమంలోనే.. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని అమ్మాయి బంధువులకు.. అబ్బాయి బంధువులు చెప్పారు.
అయితే.. అమ్మాయి సోదరులు మాత్రం పెళ్ళికి ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరూ పదిహేను రోజుల క్రితం పెళ్ళి చేసుకున్నారు. అనంతరం నల్లపాడు పోలీసులను ఆశ్రయించారు. ఇరు వర్గాలను పిలిచి మాట్లాడిన పోలీసులు బైండోవర్ రాయించి పంపించారు. పదిహేను రోజుల క్రితం దుర్గా మాలలో ఉన్న అమ్మాయి సోదరుడు దుర్గారావు.. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. మాల విరమించి వచ్చిన దుర్గారావు ఈ రోజు గుంటూరు వస్తున్న గణేష్ ను మార్గ మధ్యలోనే అడ్డుకున్నాడు.
మరో ఇద్దరి సాయంతో గణష్ పై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుండి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి కులాలు ఒక్కటే అయినా అమ్మాయి సోదరులకు నచ్చని సంబంధం చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో అబ్బాయిని దాడి చేసి చంపేశారు
Also read
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?
- ఐపీఎస్ వై పురాన్ సూసైడ్ కేసులో కొత్త మలుపు.. దర్యాప్తులో పాల్గొన్న అధికారి ఆత్మహత్య!
- Viral: ఓర్నాయనో.. పైకి చూస్తే ఫుడ్ టిన్లు.. లోపల మాత్రం కథ వేరు.. మైండ్ బ్లాంక్ అయ్యే స్టోరీ ఇది..