కన్నతల్లి, సవతి తండ్రితో కలిసి.. కన్న కుతురిని వేదింపులకు గురి చేసింది. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై..
హైదరాబాద్, అక్టోబర్ 6: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కన్న కుతురిని వేదింపులకు గురి చేసిన కన్నతల్లి, సవతి తండ్రి. స్థానికుల పిర్యాదుతో ఇద్దరిని రిమాండ్ తరలించిన పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్పేట్ ప్రాంతంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఒకటో తేదీన చిన్నారి ఒంటిపై గాయాలను గమనించిన స్థానికులు.. ఆ గాయాల గురించి వారు చిన్నారిని ఆరా తీశారు. దీంతో సవతి తండ్రితో కలిసి తన తల్లి ప్రతిరోజు కొడుతోందని, వేధింపులకు గురిచేస్తున్నట్లు చిన్నారి తెలిపింది.
చిన్నారి ఒంటి పై గాయాలతో తీవ్రంగా స్పందించిన స్థానికులు.. మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ అనంతరం చిన్నారి కన్నతల్లి షబానా నాజ్విన్, సవతి తండ్రి జావేద్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిన్నారిని మొదటగా పోలీసులు వసతి గృహానికి తరలించగా.. రెండు రోజుల తర్వాత చిన్నారి కన్నతండ్రి, బాబాయ్ వచ్చి ఇంటికి తిసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు
Also read
- ఈ జన్మలో మీ బాధలకు గత జన్మలోని పాపాలే కాదు.. మరో కారణం ఉంది తెలుసా?
- Jaya Ekadashi: జయ ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి
- Rathasaptami 2026: రథసప్తమి నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఎలా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..





