SGSTV NEWS
Spiritual

ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు? అక్టోబర్ 19నా..! 20నా..! ఈ రోజున ఏ నియమాలు పాటించాలంటే..

 

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో దీపావళి ఒకటి. దీనిని దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నరకాసురుడు అనే రాక్షసుడు మరణించిన ఆనందంతో అమావాస్య రోజున దీపావళి పండగను జరుపుకుంటారు. అంతేకాదు నరకాసురుడు మరణించిన చతుర్దశి తిథిని అంటే దీపావళికి ఒక రోజు ముందు నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీనినే కాశీ చౌదాస్, రూప్ చౌదాస్ , చోటే దీపావళి అని కూడా అంటారు. ఈ సంవత్సరం చోటీ దీపావళిని ఎప్పుడు జరుపుకోవాలంటే..


దీపావళి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన, పవిత్రమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది చీకటిలో వెలుగులు నింపే పండగ. అంటే దీపం అనే కాంతి వెలుగులో మనిషి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు సాగాలని చుసించే పండగ. ఇది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లలోకి సానుకూల శక్తిని తీసుకురావడానికి రంగురంగుల లైట్లు, మెరిసే దీపాలు, అందమైన పూలతో తమ ఇళ్లను అలంకరిస్తారు. లక్ష్మీ దేవి. గణేశుడి కొత్త విగ్రహాలను కూడా ప్రతిష్టించి పూజిస్తారు.

దీపావళికి ముందు రోజు జరుపుకునే చోటి దీపావళిని నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున యమ ధర్మ రాజును పూజిస్తారు. యమ ధర్మ రాజును పూజించడం వల్ల అందం , దీర్ఘాయువు లభిస్తుందని నమ్ముతారు.

నరక చతుర్దశి 2025 తేదీ
దృక పంచాంగం ప్రకారం నరక చతుర్దశి ఆశ్వయుజ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు వస్తుంది. ఈ సంవత్సరం చతుర్దశి తేదీ అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 20న మధ్యాహ్నం 3:44 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఈ సంవత్సరం అక్టోబర్ 19న ఆదివారం రోజున చోటి దీపావళిని అంటే నరక చతుర్ధశిని జరుపుకుంటారు. దీపావళి అక్టోబర్ 20, 2025న జరుపుకుంటారు. చోటి దీపావళి నాడు పూజకు శుభ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అక్టోబర్ 19న శుభ సమయం రాత్రి 11:41 నుంచి ఉదయం 12:31 వరకు ఉంది.



నరక చతుర్దశి ఎందుకు జరుపుకుంటారు?
పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు, సత్యభామ సమేతుడై ఈ రోజున నరకాసురుడిని వధించాడు. సత్యభామ సహాయంతో కృష్ణుడు నరకాసురుడిని చంపి దేవతలను , ఋషులను అతని బాధల నుంచి విడిపించాడు. నరకాసురు మరణించిన రోజు ఆశ్వయుజ మాసం చతుర్దశి తిథి. దీంతో ప్రజలు అందరూ సంతోషంగా సంబరాలను జరుపుకున్నారు.త అం ఆనందాన్ని ఇళ్లలో దీపాలు వెలిగించి ప్రకటించారు. అప్పడి నుంచి ఈ పండుగను జరుపుకునే సంప్రదాయం మొదలైందని పురాణ కథనం. ఈ రోజునే నరక చతుర్దశి లేదా చోటి దీపావళిగా జరుపుకుంటారు.

నరక చతుర్దశి నాడు చేయాల్సిన పూజ విధానం
నరక చతుర్దశి కూడా దీపావళి పండగలో ఒక ముఖ్యమైన భాగం. ఈ రోజున కొన్ని నియమాలను, సంప్రదాయాలను పాటించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో నిండిన పెద్ద.. ఏకముఖి దీపాన్ని వెలిగించండి. తినే ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని నివారించండి. మీ ఇంటి వద్దకు వచ్చిన పేదవారిని ఖాళీ చేతులతో పంపించవద్దు. అలా చేయడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని విశ్వాసం

Also read



Related posts