మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని చేగుంట మండలం వడియారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన మహిపాల్, యవాన్ అనే ఇద్దరు యువకులు పార్క్ చేసిన బైక్‌లను దొంగిలిస్తూ వాటిని మార్కెట్‌లో అమ్ముకొంటూ జీవిస్తున్నారు.
శుక్రవారం రాత్రి వడియారం గ్రామంలో కూడా ఓ బైక్‌ను దొంగతనం చేశారు. దొంగతనానికి వచ్చేటప్పుడు ఓ పెట్రోల్ బాటిల్‌ను కూడా తీసుకొచ్చారు. వాళ్లు దొంగిలించిన బైక్‌లో పెట్రోల్ లేదు. దీంతో దాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోయాలనుకున్నారు. కొంతదూరం నెట్టుకెళ్లాక అదే సమయంలో దుర్గామాత నిమజ్జనోత్సవానికి వెళ్తున్న కొందరు యువకులు చోరీ చేసిన బైక్‌లను గుర్తించారు. దీంతో వెంటనే మహిపాల్, యవాన్‌పై దాడి చేసేందుకు యత్నించగా మహిపాల్ పారిపోయాడు.
యవాన్‌ను స్తంభానికి కట్టేసి కొట్టారు. అతడి జేబులో ఉన్న పెట్రోల్‌ను ఒంటిపై పోసి నిప్పంటించారు. దీంతో యవాన్‌కు 90 శాతం గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిపాల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. యవాన్‌పై ఇలా పెట్రోల్ పోసి నిప్పంటించినందుకు పోలీసులు గ్రామస్థులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also read
- నేటి జాతకములు..3 డిసెంబర్, 2025
- Sabarimala: శబరిమల 18 మెట్ల వెనకున్న ఆధ్యాత్మిక రహస్యం తెలుసా?.. ఒక్కో మెట్టుకు ఒక్కో ప్రాధాన్యత
- Tirupati Crime News: ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
- Apstc కర్చీఫ్ వేసిన సీటులోకూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
- Acid attack: దారుణం.. నర్సింగ్
విద్యార్థినిపై యాసిడ్ దాడి..





