SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra News: భార్య స్నానం చేస్తుండగా వీడియో రికార్డింగ్.. భర్త ఏం చేశాడో తెలుసా..? రెండేళ్లకు వీడిన మిస్టరీ

 

భార్యను లైంగికంగా వేధిస్తున్నాడని.. వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా తరహాలో.. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిని భర్త హత్య చేసి జలాశయంలో పడేశాడు. అయితే హత్య జరిగిన రెండేళ్ల తర్వాత.. మర్డర్ కేసు మిస్టరీని వీడింది. శ్రీ సత్య సాయి జిల్లా నల్ల చెరువు మండలం అలుగుండు గ్రామంలో 2023లో జరిగిన ఈ హత్య కేసును రెండేళ్ల తర్వాత పోలీసులు చేధించారు.


నల్లచెరువు మండలం అలుగుండులో 2023లో అమర్నాథ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అయితే అప్పట్లో అమర్నాథ్ మృతి కేసును అనుమానాస్పద మృతిగా నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నల్లచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్లోపల్లి జలాశయంలో అప్పట్లో అమర్నాథ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అమర్నాథ్ మృతికి ఎలాంటి క్లూ దొరకపోవడంతో పోలీసులు మొదట ఆత్మహత్యగా భావించినప్పటికీ.. అనుమానాస్పద మృతిగానే విచారణ చేపట్టారు. రెండేళ్లుగా అమర్నాథ్ మృతికి సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు. అయితే సత్య సాయి జిల్లా ఎస్పీగా వచ్చిన సతీష్ కుమార్ అమర్నాథ్ అనుమానాస్పద మృతి కేసుపై దృష్టి పెట్టారు.ఎలాగైనా కేసు మిస్టరీని ఛేదించాలని లోతైన దర్యాప్తు ప్రారంభించారు.

ఇందులో భాగంగా అలుగుండు గ్రామంలో అమర్నాథ్‌కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న కోణంలో గ్రామస్తులను విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయం పోలీసులు తెలిసింది. అమర్నాథ్ మృతికి కొద్దిరోజుల ముందు అలుగుండు గ్రామంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా అమర్నాథ్ వీడియో తీశాడని. వీడియో చూపించి తన లైంగిక కొరిక తీర్చాలంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేసినట్లు గ్రామస్తులు చెప్పారు. దీంతో పోలీసులు మహిళ భర్త దాదా పీర్ను అదుపులో తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

తన భార్య స్నానం చేస్తుండగా రహస్యంగా తీశాడన్న విషయం తెలుసుకున్న దాదా పీర్ మరో ఇద్దరి వ్యక్తులతో కలిసి అమర్నాథ్ హత్యకు ప్లాన్ చేశాడు. అమర్నాథ్ ను మద్యం తాగుదామని మాయమాటలు చెప్పి నిందితులు దాదా పీర్, అతని స్నేహితులు సాదిక్, యాసిన్ లు కదిరి రూరల్ బాలప్పగారిపల్లికి తీసుకెళ్లారు. ఫుల్లుగా మద్యం తాగిన తర్వాత అమర్నాథ్ ను తలపై బండరాళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహానికి రెండు బండరాళ్లు కట్టి చెర్లోపల్లి జలాశయంలో పడేశారు. అమర్నాథ్ హత్యకు గురైన కొద్ది రోజుల తర్వాత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.

2023లో జరిగిన అమర్నాథ్ హత్య ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో రెండేళ్లుగా పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. అయితే అలుగుండు గ్రామస్తులు ఇచ్చిన చిన్న సమాచారంతో మొత్తం దృశ్యం సినిమా తరహా మర్డర్ మిస్టరీని నల్లచెరువు పోలీసులు చేదించారు. తన భార్య వీడియో తీసీ బ్లాక్‌ మెయిల్ చేయడంతో అమర్నాథ్‌ను హత్య చేసినట్టు బాబా పీర్ ఒప్పుకున్నాడు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు

Also read

Related posts