చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి నిందితులు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడి, రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు..
చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నగరవనంలో ఒంటరిగా ఉన్న ప్రేమజంటను అటవీశాఖ సిబ్బంది పేరుతో బెదిరించి నిందితులు దారుణానికి పాల్పడ్డారు.. ప్రేమికుడిని నిర్బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడి, రికార్డు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితులకు బేడీలు వేసి నడిరోడ్డుపై కిలోమీటర్ మీర నడిపించి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. ప్రజలు శాపనార్థాలు పెడుతూ నిందితుల్ని తిట్టిపోశారు. కిశోర్, మహేష్, హేమంత్‌ని నిన్న గుడిపాలరోడ్డులో అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులపై పోక్సో, అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం, కిడ్నాప్ సెక్షన్లు నమోదు చేశారు.
ఒంటరి అమ్మాయిలు, ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించే వారని పోలీసులు తెలిపారు. చిత్తూరులోని మురకంబట్టు ప్రాంతంలో 25-09-2025న మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ముగ్గురు నిందితులు మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్ ను అరెస్ట్ చేసినట్లు చిత్తూరు తాలుకా పోలీసులు వెల్లడించారు.
వివరాల ప్రకారం..
ఈ నెల 25-09-2025న మురకంబట్టు నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమజంటపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, వారి వద్దనున్న విలువైన వస్తువులను దోచుకుని, గాయపరచడంతో పాటు బాలికపై అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత యువకుడు 29-09-2025న చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. తాలూకా ఎస్.ఐ. మల్లికార్జున కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో 30-09-2025న పోస్కోతోపాటు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దీనిపై జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్‌డివిజన్ డి.ఎస్.పి. టి. సాయినాథ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం ఆంధ్రప్రదేశ్, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలలో గాలింపు చేపట్టారు. తాజాగా అందిన సమాచారం ఆధారంగా, చిత్తూరు పట్టణంలోని చెన్నమ్మ గుడిపల్లి రహదారి వద్ద వాకర్స్ అసోసియేషన్ నిర్మించిన యోగ అరుగుల సమీపంలో నిందితులను అరెస్టు చేశారు.
A1 మహేష్: 2019లో చిత్తూరు తాలూకా పరిధిలో ఒక మైనర్ అమ్మాయిని ఈవ్‌టీజింగ్ చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. A2 కిషోర్: 2022లో పట్టణంలోని ఒక వైన్‌షాప్‌లో పనిచేస్తూ, అక్కడి మద్యం బ్లాక్‌లో విక్రయిస్తున్నాడని కేసు నమోదు అయింది.
కాలక్షేపం కోసం పార్కుకు వచ్చే ప్రేమ జంటలను లక్ష్యంగా చేసుకొని వారి గోప్యతను వీడియోలు తీసి వారిని బెదిరించి వారి వద్ద నగదును దోచుకొని వారిని శారీరకంగా అనుభవించడం వీరి నేర ప్రవృత్తి అని పోలీసులు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి వారి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇటువంటి ఘటనలు మరల పునరావృతం కాకుండా ఉండేందుకు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్మానుష్య ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేసి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పోలీసులకు సహకరించాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాలలో పార్కులకు వచ్చే ప్రేమికులు హద్దులు మీరకుండా ఉండాలని, విద్యా ఉద్యోగాలపై ద్రుష్టిపెట్టాలని.. విద్యాసంస్థలు దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బాలికల తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.
ముద్దాయిల వివరాలు :
A1. ఎం.మహేష్, @ కట్టమంచి మహేష్, వయస్సు 21 సంవత్సరాలు, తండ్రి మణి, జి.కె. నగర్, మురకంబట్టు, చిత్తూరు పట్టణం.
A2. పి. కిషోర్, వయసు 31 సంవత్సరాలు, తండ్రి ఎం.పంచాక్షరం, ఎం. అగ్రహారం, మురకంబట్టు, చిత్తూరు పట్టణం.
A3. జె. హేమంత్ ప్రసాద్, వయస్సు 27 సంవత్సరాలు, తండ్రి జగన్నాథం, మంగసముద్రం, సంతపేట,
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!