ఢిల్లీ బాబా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఆయన మహిళా సహాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలు నచ్చితే ఆశ్రమంలో ప్రత్యేక గది కేటాయించడమే కాకుండా..సెల్ ఫోన్ కూడా ఇచ్చేవారని వారు విచారణలో చెప్పా
ఢిల్లీలోని ఒక ప్రవైట్ ఇనిస్టిట్యూట్ లో 17 మంది విద్యార్థినులపై లైంగికంగా వేధించారనే ఆరఓపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ బాబా అకా చైతన్యానంద సరస్వతి ముగ్గురు మహిళా సహాయకులను తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాబా కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేయడం, బెదిరించడం…ఇంకా లైంగిక కార్యాలకు ప్రేరేపించడం వటి ఆరోపణలతో శ్వేతా శర్మ (అసోసియేట్ డీన్), భావన కపిల్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), కాజల్ (సీనియర్ ఫ్యాకల్టీ) అనే మహిళలను అరెస్టు చేశారు. వీరిని విచారిస్తున్న సమయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. బాబా సూచనల మేరకే తాము పని చేశామని ఆ మహిళలు ఒప్పుకున్నారు. క్రమశిక్షణ మరి కొన్న సాకులతో విద్యార్థినులపై లైంగికంగా ఒత్తిడి తెచ్చే వారమని మహిళలు తెలిపారు.
ప్రత్యేక గదులు, సెల్ ఫోన్లు..
ఇదికాక చైతన్యానంద సరస్వతి పని చేసిన వసంత కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ లో 2016లో చదివిన విద్యార్థి మరిన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు. స్వామిజీకి అమ్మాయి నచ్చితే చాలు ప్రత్యేక సౌకర్యాలతో గది లభించేదని తెలిపాడు. అంతేకాదు బ్లాక్ బెర్రీ, ఆపిల్ లాంటి ఖరీదైన ఫోన్లను కూడా ఇచ్చేవాడని చెప్పాడు. దాని తరువాత అమ్మాయిలు వాడుతున్న ఫోన్లను ఆయన కూడా యాక్సెస్ చేసే సౌకర్యం పొందేవాడని..చాట్‌లు, సందేశాలు డిలీట్ చేయగలిగే ఏర్పాట్లు కూడా చేసుకున్నాడని విద్యార్థి తెలిపాడు.అలాగే ఆ ఫోన్లతో ఫ్యామిలీ, బంధువులతో మాట్లాడవద్దని చెప్పేవాడని అన్నాడు. బాబాకు దుబాయ్ షేక్‌తో మంచి సంబంధాలు ఉన్నాయని.. ఒక అమ్మాయిని దుబాయ్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేశాడని చెప్పుకొచ్చాడు.దుబాయ్, యూఏఈల గురించి ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండేవాడని.. సెక్స్ రాకెట్ గురించి మాత్రం తనకు తెలియదని తెలిపాడు.
బాబాను అమ్మాయిల తల్లిదండ్రులు బలంగా నమ్మేవారని…అందుకే ఇనిస్టిట్యూట్ లో జాయిన్ చేసేవారని విద్యార్థి చెప్పాడు. 2016లో చాలా ఘోరాలు జరిగాయని…ఇప్పుడు మరింత తీవ్రం అయినట్టు తెలుస్తోందని చెప్పుకొచ్చాడు హాస్టల్ వార్డెన్లే దీనంతటికీ కారణమని…వారే అమ్మాయిలను బాబా దగ్గరకు చేర్చే వారని..దాని తరువాత వారినిబాబా ముగ్గులోకి లాగి అఘాయిత్యాలకు పాల్పడేవాని విద్యార్థి తెలిపాడు.
పోలీసులు చైతన్యానంద ఆశ్రమంలో కూడా తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా పోలీసులకు ఊహించని వస్తువులు లభ్యమయ్యాయి. శృంగారానికి సంబంధించిన ఫోటోలు…వాటికే చెందిన సీడీలు దొరికాయి. దాంతో పాటూ దొంగ బాబా… ప్రధాని మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ నేతలతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫొటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా కాలేజీలో మహిళా సిబ్బంది ఫొటోలు తీయడం, విద్యార్థినులతో అసభ్యంగా చాట్ చేయడం, వారి కదలికలను సీసీ కెమెరా యాప్ ద్వారా పర్యవేక్షించడం లాంటివి కూడా చేసినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయని తెలుస్తోంది.
ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్న చైతన్యానంద విచారణలో వారికి సహకరించడం లేదని తెలుస్తోంది. దానికి తోడు తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికి కూడా అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని..తప్పు అంత ఈజీగా ఒప్పుకునే రకంగా కాదని పోలీసులు చెబుతున్నారు. దుబాయ్ షేక్ వ్యవహారంలో ఎవరి గురించి అతను అడిగాడు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!