SGSTV NEWS
CrimeTelangana

Hyderabad: మరీ ఇంత దారుణమా.. పాతబస్తీలో బాలిక కాళ్లు, చేతులు కట్టేసి.. ఆ తర్వాత..



అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్‌లో శవమై తేలింది.. మంగళవారం కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక బుధవారం అనుమానస్పద స్థితిలో నీళ్ల ట్యాంకులో విగత జీవిగా కనిపించడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది..

అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్‌లో శవమై తేలింది..! మంగళవారం కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక బుధవారం అనుమానస్పద స్థితిలో నీళ్ల ట్యాంకులో విగత జీవిగా కనిపించడంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. అయితే.. ఆమెను హత్య చేసి.. నీళ్ల ట్యాంకులో వేయడం కలకలం రేపింది.  ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక హుమేయాని సుమ్మయ్య తల్లితో పాటు మాదన్నపేట్ చావనిలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది.. మంగళవారం సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. అంతటా వెతికిన కుటుంబసభ్యులు చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే.. బాలిక ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్‌లో కనిపించిందని సమచారం అందింది.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.. అయితే.. బాలిక కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో.. ఆమెను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు..
బాలిక మరణంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. హైదరాబాద్ పాతబస్తీ మదన్న పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చావుణిలో జరిగిన ఈ అమానుష ఘటన.. నగరంలో కలకలం రేపింది.. 7 ఏళ్ల చిన్నారి సుమయ్య మృతదేహం నీటి ట్యాంక్‌లో లభ్యం అవ్వడం.. చేతులు, కాళ్లు కట్టి హత్య చేసిన ఉందంతంపై పోలీసులు ముమ్మరంగా దర్యప్తు చేస్తున్నారు. ఆమెను ఎవరు చంపారన్న దానిపై పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆదేశాలతో యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ మదన్న పేట ఏసీపీ, సీఐలను కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read

Related posts