ప్రేమించిన యువతిని చంపి.. ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఏపీలో కలకలం రేపింది.. షాపింగ్కి అని వెళ్లిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు .. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమించిన యువతిని చంపి.. ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఏపీలో కలకలం రేపింది.. షాపింగ్కి అని వెళ్లిన ప్రియురాలిని ప్రియుడు హత్య చేశాడు .. అనంతరం అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో ప్రేమికుల మృతి కలకలం రేపింది.. కాకినాడ జిల్లా సామర్లకోట మండల పరిధిలోని పనసపాడు గాడేరు కాలువ గట్టుపై పదిహేడేళ్ళ మైనర్ బాలికను హత్య చేసి హుస్సేన్ పురం సమీపంలోని రైలు కిందపడి 19 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన బాలిక కాకినాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు బస్సులో వెళ్లొచ్చేది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతున్న సమయం నుండి అదే గ్రామానికి చెందిన యువకుడికి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. రెండ్రోజుల పాటు వీకెండ్ ఎగ్జామ్స్ ఉన్నాయని కాకినాడలోని బాలిక పెదనాన్న ఇంటికి వెళ్ళింది. బాలిక మంగళవారం సాయంత్రం నుండి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తెలిసిన చోట్ల వెతికారు.
అయితే ఈరోజు ఉదయం బాలికను హత్య చేశారన్న విషయం తెలుసుకున్న బంధువులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. బాలిక హత్యపై విచారణ చెయ్యాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను అత్యంత కిరాతకంగా బ్లేడుతో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే బాలికను ప్రేమిస్తున్న అశోక్ సామర్లకోట మండలం గూడపర్తి సమీపంలో అశోక్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో బాలికను అశోక్ చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు తెలిపారు. ఇద్దరిదీ హత్యనా..? లేదంటే కావాలని ఆత్మహత్య చేసుకున్నారా..? అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, బాలిక మంగళవారం సాయంత్రం షాపింగ్ కోసం కాకినాడ వెళ్లిందని.. ఆమెను యువకుడు బైక్పై ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Mantralayam మానవత్వన్ని చాటిన కానిస్టేబుల్.. మహిళ మృతదేహాన్ని కిలోమీటర్ మోసుకెళ్లి…(video)
- 30వ ప్లోర్ నుంచి పార్క్ చేసిన కారుపై పడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి.. షిఫ్టైన రెండ్రోజులకే
- Telangana: కూతురిపై లైంగిక వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి మరీ కొట్టి చంపిన భార్య!
- మామ హత్య కోసం రూ.5 లక్షల సుపారి… పచ్చని సంసారంలో చెడు వ్యసనాల చిచ్చు..
- హైదరాబాద్లో దారుణం.. చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసిన రాక్షసుడు..





