గుంతకల్లు పట్టణం, గుంతకల్లు, : పాత ఇంటిని కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తుండగా.. దాని గోడ కూలి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడిని బలిగొన్న విషాద ఘటన ఇది. అనంతపురం జిల్లా గుంతకల్లులో శనివారం జరిగిన ఈ ప్రమాదంపై బాధిత కుటుంబ సభ్యుల కథనం.. మున్సిపల్ కూరగాయల మార్కెట్ వెనుక రమేశ్ అనే వ్యక్తి ఓ పాత ఇంటిని కొనుగోలు చేశారు. రెండు రోజులుగా మరమ్మతులు చేయిస్తున్నారు. ఏకలవ్యనగర్లో కిరాణా దుకాణం నడిపే వెంకటరాముడు (57) సరకుల నిమిత్తం శనివారం బైక్పై మార్కెట్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా పనులు జరుగుతున్న ఇంటి వద్దకు రాగానే ఒక్కసారిగా గోడ కుప్పకూలి ఆయనపై పడిపోయింది. తీవ్రంగా గాయపడిన వెంకటరాముడు అక్కడికక్కడే మరణించారు భర్త ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో భార్య ఉమాదేవి అక్కడికి చేరుకున్నారు. మట్టి పెల్లల కింద విగతజీవిలా పడి ఉన్న భర్తను చూసి గుండెలవిసేలా రోదించారు. జనసంచారం ఉన్నచోట ఎలాంటి హెచ్చరిక బోర్డులూ లేకుండా పనులు ఎలా చేపడతారని స్థానికులు ప్రశ్నించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Also read
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!
- మరదలితో పెళ్లి జరపడం లేదనే మనస్తాపం.. పురుగుల మందు తాగిన యువకుడు..!
- Konaseema: పెంచుకున్న తల్లిదండ్రులకే పంగనామం పెట్టిన కూతురు.. ఆస్తి, డబ్బులు తీసుకుని వదిలేసింది..
- భక్తులు ఇచ్చే దక్షిణలు సరిపోక.. పవిత్ర వృత్తికే మచ్చ తెచ్చిన పూజారి.. ఏం చేశాడో తెలుసా?