SGSTV NEWS
CrimeNational

Kerala: భార్యను చంపి.. ఫేస్‌బుక్‌లో లైవ్ చేసిన భర్త


కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి ఏకంగా ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే ప్రకటించడం కలకలం రేపింది. హత్య తర్వాత భర్త ఇసాక్ (42) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

కేరళలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి ఏకంగా ఫేస్‌బుక్‌ లైవ్‌లోనే ప్రకటించడం కలకలం రేపింది. హత్య తర్వాత భర్త ఇసాక్ (42) పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలిని కొల్లం జిల్లాకు చెందిన శాలిని(39)గా పోలీసులు గుర్తించారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. గల్ఫ్‌ నుంచి తిరిగొచ్చిన ఇసాక్‌ రబ్బర్‌ ట్యాప్పర్‌గా పనిచేస్తున్నాడు.  అతడు ఉంటున్న ప్రాంతానికి సమీపంలోకనే భార్య శాలిని పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది.


ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నిరోజుల నుంచి శాలిని, ఇసాక్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే సోమవారం ఉదయం 6.30 గంటలకు శాలిని కిచెన్‌ వెనుకున్న పైప్‌లైన్‌ వద్దకు స్నానం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ఇసాక్‌ ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. మెడ, ఛాతీ, వీపుపై శాలినీకి తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఆ తర్వాత ఇసాక్ ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టి తన భార్యను చంపేసినట్లు వివరించాడు. 

శాలిని ఎప్పుడూ కూడా తన మాటలు వినలేదని.. తన తల్లితోనే ఉండేందుకు వెళ్లిందని ఆరోపణలు చేశాడు. చివరికి కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. భార్యను ఇలా చంపేసి ఫేస్‌బుక్‌ లైవ్ చేయడంతో ఈ ఘటన దుమారం రేపింది. ఇసాక్‌ కూడా పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది.

Also read

Related posts