హైదరాబాద్ మహానగరం శివారు కోకాపేట్‌లో దారుణం వెలుగు చూసింది. నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచి చంపింది ఓ భార్య. రాత్రి దంపతుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు.

భరఖ్ బోరా, కృష్ణ జ్యోతి బోరా అనే దంపతులు అస్సాం నుండి హైదరాబాద్ నగరానికి వలస వచ్చారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని కోకాపేటలో నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరి మధ్య తరచుగా చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుండేవారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత బరఖ్ నిద్రపోయాడు.
ఆ వ్యక్తి నిద్రపోతున్నప్పుడు, అతని భార్య జ్యోతి కూరగాయలు కోసే కత్తిని తీసుకుని గొంతు కోసి చంపింది. అతని అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వచ్చి చూసేసరికి, భరఖ్ రక్తపుమడుగులో పడి కనిపించాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అధిక రక్తస్రావం కారణంగా ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకుని భరఖ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు
Also read
- Job Astrology: గ్రహాల అనుకూలత.. ఈ రాశులకు పదోన్నతి, అధికార యోగాలు..!
- దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
- TG Crime: జనగామ జైలులో కలకలం.. బ్లీచింగ్ పౌడర్ నీళ్లు తాగి రిమాండ్ ఖైదీ సూ**సైడ్.. కారణం ఇదేనా?
- Khammam : వీడు టీచర్ కాదు టార్చర్.. అబ్బాయిపై లైంగిక వేధింపులు.. రోజు రాత్రంతా!
- Dialysis: డయాలసిస్ కేంద్రాలకు వెళ్ళే వారికి కొత్తరోగాలు.. రాష్ట్రంలో షాకింగ్ ఘటనలు!