SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం



హైదరాబాద్: నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం  జరిగింది. ఫ్లోర్ ఇంఛార్జ్ దాడిలో ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి సాయి పునీత్ దవడ ఎముక విరిగింది. గడ్డి అన్నారం నారాయణ కాలేజీ బ్రాంచ్లో ఘటన జరిగింది. ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం 3:15 గంటలకు ఇద్దరు విద్యార్థుల మధ్య వివాదం జరిగింది. విద్యార్థుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో జోక్యంచేసుకున్న ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులను చితకబాదాడు.



తిండి తినలేని స్థితిలో విద్యార్థి ఉన్నాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మలక్పేట పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో ఫ్లోర్ ఇంఛార్జ్ప పోలీసులు కేసు నమోదు చేశారు. కాలేజీ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి రాగా, విద్యార్థుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కనిపించింది. తప్పు గురించి పక్కనబెడితే.. గొడవ జరుగుతున్న సమయంలో ఇన్ఛార్జ్ సతీష్.. విద్యార్థులపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

Also read

Related posts

Share this