SGSTV NEWS
Andhra PradeshCrime

టెంపుల్ సిటీలో విగ్రహం వివాదం.. ఏకంగా మాజీ ఛైర్మన్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు!


తిరుపతిలోని అలిపిరి సమీపంలోవిగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుపతి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 23వ తేదీన విచారణకు వస్తానని భూమన కరుణాకర్ రెడ్డి పోలీసులకు చెప్పారు.


ఇక విగ్రహం వివాదంపై స్పందిస్తూ, తాను ఎలాంటి వివాదాన్నీ సృష్టించలేదని, కేవలం విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడవేయడంపై మాత్రమే ప్రశ్నించానన్నారు. తనపై ఇంకో 100 కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. టీటీడీ పాలకమండలి తప్పులు చేస్తున్నంత కాలం తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. TTD బోర్డు సభ్యులు ఆ విగ్రహాన్ని శని విగ్రహం అని చెబుతున్నారని, శని భగవానుడిని దెయ్యంలా చూస్తున్నారా ఆయన ప్రశ్నించారు.

అసలేం జరిగిందంటే..?


అలిపిరి వద్ద రోడ్డు పక్కన పడి ఉన్న విగ్రహంపై సందిగ్ధత నెలకొంది. ఏ దేవతా మూర్తిదో తెలియని పరిస్థితి నెలకొంది. మహావిష్ణువు విగ్రహమని వైసీపీ.. కాదు కాదు శనేశ్వరుడి విగ్రహం అంటూ టీటీడీ పాలకమండలి చేస్తున్న వాదనతో విగ్రహానికి రాజకీయ గ్రహణం పట్టింది. మరోవైపు టీటీడీ ప్రతిష్టను దిగజార్చితే కొరడా ఝులిపిస్తామంటున్న టీటీడీ ఫిర్యాదుతో భూమన పై కేసు నమోదు కావడంతో విగ్రహ వివాదం పీక్స్ కు చేరుకుంది.

వివాదానికి కారణమైన విగ్రహం

తిరుపతి నుంచి అలిపిరికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన దర్శనమిస్తున్న విగ్రహం పెద్ద దుమారమే లేపింది. టీటీడీ శిల్ప కళాశాల పక్కనే పడి ఉన్న 12 అడుగుల విగ్రహం పొలిటికల్ కాంట్రవర్సీకి కారణమైంది. అసలు ఆ విగ్రహం ఏ దేవత మూర్తిదో.. చెక్కించిందెవరో.. ఎందుకు అసంపూర్తిగా వదిలి వేశారో.. ఎన్నేళ్లుగా ఆ విగ్రహం అక్కడుందో.. గానీ ఇప్పుడు మాత్రం విగ్రహం చుట్టూ వివాదం నడుస్తోంది. అలిపిరి వద్ద ఉన్న ఓల్డ్ చెక్ పాయింట్ వద్ద పడిఉన్న విగ్రహం పాతదే అయినా వివాదం మాత్రం కొత్తదైంది. విగ్రహం మహావిష్ణువుదని టీటీడీ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి. అపచారమంటూ మీడియా దృష్టికి తెచ్చారు.

కరుణాకర్ వ్యాఖ్యలపై టీటీడీ ఫైర్

హిందూ దేవుళ్ళ విగ్రహాల పట్ల నిరక్ష్యమంటూ ఆరోపణలు చేయడంతో టీటీడీ చర్యలకు కారణం అయ్యింది. హైందవ ధర్మం పట్ల నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భూమన చేసిన విమర్శలను టీటీడీ పాలకమండలి సీరియస్ గా తీసుకుంది. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన టీటీడీ బోర్డు సభ్యులు, ఆ విగ్రహం 20 ఏళ్లుగా అక్కడే ఉందని శిల్పి కన్నాచారి కొడుకు గురుస్వామిని తెర మీదకి తెచ్చారు. అది శ్రీమహా విష్ణువు విగ్రహం కాదని, శని భగవానుడిదని శిల్పి కొడుకు గురుమూర్తితో పాటు పాలక మండలి సభ్యులు చెప్పడంతో విగ్రహం గందరగోళం సృష్టించింది.

ఆ విగ్రహం ఏ దేవతా మూర్తిది..?

ఇలా అలిపిరి వద్ద పడిపోయిన 12 అడుగుల విగ్రహాన్ని ఒకవైపు వైసీపీ మరోవైపు టీటీడీ పాలక మండలి పరిశీలిస్తుండటంతో పొలిటికల్ హిట్ పెరిగింది. విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆర్డర్ ఇచ్చిన దాత చనిపోవడం, విగ్రహాన్ని అసంపూర్తిగా వదిలేసిన శిల్పి కూడా మరణించడంతో అసలు ఆ విగ్రహం ఏ దేవతా మూర్తితో తెలియని పరిస్థితికి కారణం అయ్యింది. అయితే ఇప్పటికీ ఎక్కడికీ కదిలించకుండా రోడ్డు పక్కనే ఆ విగ్రహం అక్కడే ఉండటం రాజకీయ దుమారం రాజుకుంది.

Also read

Related posts

Share this